ఏకపక్షంగా కాల్పులు, బూటకపు ఎన్ కౌంటర్; అక్టోబర్ 27న బంద్ కు పిలుపు: మావోయిస్ట్ పార్టీ లేఖ !!
ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏకే-47తో పాటుగా పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దులో ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పులను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ పాటిల్ ధ్రువీకరించారు. అయితే తాజా ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖను విడుదల చేసింది.

ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటర్ నే
ములుగు జిల్లా టేకులగూడెం అటవీ ప్రాంతంలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా వెల్లడించారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇచ్చాడని, సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర గ్రేహౌండ్స్ పోలీసులు పక్కా సమాచారంతో వందలాది మందితో మా బలగాలను చుట్టుముట్టి దొంగదెబ్బ కొట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ దాడిని టిఆర్ఎస్ ప్రభుత్వం పక్కా ప్లాన్ తో చేయించిందని జగన్ ఆరోపించారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటర్ అని స్పష్టం చేశారు.

వ్యూహాత్మక సమాధాన్ దాడి.. అణచివేతకు కేసీఆర్ లో రెట్టించిన ఉత్సాహం
టిఆర్ఎస్ ప్రభుత్వం మానవ రక్తానికి మరిగిందనీ, విప్లవకారులను హత్యచేసి ప్లీనరీ పేరిట నెత్తుటి హోళీ ఆడుతుందని తెలంగాణలో అభివృద్ధిని వల్లిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం సొంత లాభాల కోసం, ప్రజా పోరాటాలను, విప్లవకారులను హత్యలు చేయడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఈనెల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి భేటీ తర్వాత వ్యూహాత్మక సమాధాన్ దాడి లక్ష్యంలో భాగంగా కెసిఆర్ రెట్టించిన ఉత్సాహంతో అణచివేతకు పూనుకుంటున్నారని పేర్కొన్నారు. నీచమైన అకృత్యాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు.

ఎన్ కౌంటర్ లో ముగ్గురు మరణించినట్టు ధృవీకరించిన మావోయిస్ట్ పార్టీ
ఈరోజు జరిగిన దాడిలో ముగ్గురు కామ్రేడ్స్ అమరులయ్యారు అని వారు ముగ్గురు నిరుపేద ఆదివాసి కుటుంబాలలో జన్మించిన వారిని, పీడిత ప్రజల విముక్తి కోసం తమ కుటుంబాలను వ్యక్తిగత ప్రయోజనాలను తృణప్రాయంగా వదిలి విప్లవోద్యమంలో చేరారని పేర్కొన్నారు. ఈరోజు ఎన్కౌంటర్లో మరణించిన వారి వివరాలను వెల్లడించిన మావోయిస్టు పార్టీ నరోటి చామాల్ మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా జారవేడ గ్రామవాసి అని, పార్టీ సభ్యులు సోడి రామాల్ బీజాపూర్ జిల్లా బాసర గూడెం ప్రాంతం మల్లిపాడు గ్రామానికి చెందిన వాడని, పూనెం భద్రుది బీజాపూర్ జిల్లా గంగ లూరు ఏరియా పెద్దకోర్మ గ్రామానికి చెందిన వాడని వెల్లడించారు.
Recommended Video

బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 27వ తేదీన బంద్
ప్రపంచ సోషలిస్టు విప్లవమే వారి లక్ష్యంగా సెంట్రల్ రీజనల్ కంపెనీ నిర్మాణంలో పని చేస్తున్నారని జగన్ వెల్లడించారు. దోపిడీ వర్గాల ప్రయోజనాలను కాంక్షించే పాలకవర్గాలు ఈ ఆదివాసి ముద్దుబిడ్డ లను పొట్టనపెట్టుకున్నాయని విమర్శించారు. పీడిత ప్రజల పక్షాన నిలిచి తమ నులివెచ్చని రక్తాన్ని ధారబోసిన ఈ కామ్రేడ్స్ కు వినమ్రంగా జోహార్ లర్పిద్దామంటూ తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేర్కొంది. వారి బందూకులను అందుకని వారి ఆశయాలను నిజం చేద్దామని లేఖలో పేర్కొన్నారు జగన్. తెలంగాణ ప్రభుత్వం చేసిన బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 27వ తేదీన బంద్ ను పాటించాలని విప్లవ శ్రేణులను, అన్ని రకాల వ్యాపార వాణిజ్య వర్గాలను, ప్రజలను కోరుతున్నామని మావోయిస్టు పార్టీ తమ లేఖలో పేర్కొంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications