వధువుకు ప్రియురాలి మేసేజ్ అర్ధాంతరంగా రద్దైన పెళ్ళి, వరుడిని పోలీసులిలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్:అచ్చు సినిమాల్లో జరిగినట్టుగానే వరంగల్ జిల్లాలో ఓ సంఘటన చోటుచేసుకొంది. మరికొద్దిసేపట్లో వివాహం జరగాల్సి ఉంది.అయితే వధువు సెల్ పోన్ కు వచ్చిన ఓ మేసేజ్ అర్ధాంతరంగా వివాహం రద్దు చేసుకొనేలా చేసింది. వధువే స్వయంగా పోలీసులకు వరుడిపై పిర్యాదు చేసింది.ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకొంది.

వరంగల్ నగరంలోని రామన్నపేటకు చెందిన యువతికి కృష్ణాజిల్లాకు చెందిన పేట భరత్ శ్రీనివాస్ తో పెళ్ళి నిశ్చయమైంది. ఆదివారం తెల్లవారుజామున వివాహముహుర్తాన్ని నిర్ణయించారు. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు కాజీపేటలోని శ్యామల గార్డెన్ కు చేరుకొన్నారు. అంతలో పెళ్ళికూతురు సెల్ ఫోన్ కు ఓ మేసేజ్ వచ్చింది. ఆ మేసేజ్ చదవిన పెళ్ళికూతురు తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని పెద్దలకు చెప్పింది.

marriage stopped with a girl friend message in Warangal

గతంలో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళికి సిద్దమైన పెళ్ళి కొడుకును పోలీసులకు పట్టించింది వధువు.విషయం తెలుసుకొన్న సుబేదారి పోలీసులు పెళ్ళిమండపానికి చేరుకొని పెళ్ళి కొడుకును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

భరత్ శ్రీనివాస్ విజయవాడలోని హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో రిలేషన్ షిప్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సునిత అనే యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు.పెళ్ళి చేసుకొంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకొన్నాడు. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా వేరే అమ్మాయితో పెళ్ళికి సిద్దమయ్యారు. ఈ విషయం తెలుసుకొన్న సునిత వధువు ఫోన్ నెంబర్ కనుక్కొని పూర్తి వివారాలో ఆమెకు మేసేజ్ పెట్టంది.దీంతో వధువు ఈ పెళ్ళిని రద్దు చేయాలని పెద్దలను కోరింది.ఈ మేరకు అర్ధాంతరంగా వివాహం నిలిచిపోయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
marriage stopped with a girl friend message in Warangal.Bharat srinivas love a girl sunita, but he didn't marry her, Sunita messege to bride about bharatsrinivas. then marriage cancelled.
Please Wait while comments are loading...