టెక్కీ భార్య ఆత్మహత్య: గోడపై సూసైడ్ నోట్, బిక్కచచ్చిన పిల్లలు (పిక్చర్స్)

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న టెక్కీ భార్య సుజాత ఆత్మహత్యతో పిల్లలు బిక్క చచ్చిపోయారు. తల్లి శవం వద్దే రాత్రంతా పిల్లలు సొమ్మసిల్లి పడిపోయారు.ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భార్య హైదరాబాదులోని కూకట్‌పల్లిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇంటి యజమాని వేధింపులకు కలత చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

ఇంటి యజమానితో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. పిల్లలు గోల చేస్తున్నారంటూ ఇంటి యజమాని ఆమెతో గొడవకు దిగాడు. ఆ గొడవ చిలికి చిలికి పెద్దదైంది. చివరికి అతను తన భార్యతో కలిసి ఆమెపై చేసుకున్నాడు.

ఈ ఘటనతో తీవ్రమైన మనస్తాపానికి గురై ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లికి ఏమైందో తెలియక ఆ ఇద్దరు చిన్నారులు రాత్రంతా తల్లి శవం వద్దే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లారు. ఉదయాన్నే ఊరి నుంచి వచ్చిన భర్త జరిగిన ఘోరాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాడు.

నిందిత దంపతుల అరెస్ట్

సుజాత ఆత్మహత్యకు కారణమైన ఇంటి యాజమాని ప్రసన్నకుమార్, హేమలత దంపతులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని కోర్టులో హాజరుపర్చి, విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

భర్త ఇంట్లో లోని సమయంలో..

భర్త ఇంట్లో లోని సమయంలో..

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రామకృష్ణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఐదేళ్ల క్రితం గుంటూరుజిల్లా కారుమంచి గ్రామానికి చెందిన సుజాతతో వివాహమైంది. ఉద్యోగం కోసం హైదరాబాద్ నగరం చేరిన ఆలుమగలు కూకట్‌పల్లి శ్రీనివాస్ కాలనీలో ఉంటున్నారు.

పిల్లల ఆట పాటలకు వారికి చిర్రెత్తింది..

పిల్లల ఆట పాటలకు వారికి చిర్రెత్తింది..

ఇంటి యజమానులు ప్రసన్నకుమార్‌, స్నేహలత దంపతులు మొదటి ఫ్లోర్‌లో ఉండగా, సెకండ్‌ ఫ్లోర్‌లో రామకృష్ణ దంపతులు ఉంటున్నారు. వీరికి మూడున్నరేళ్ల బాబు, ఏడాదిన్నర పాప ఉన్నారు. ఈ చిన్నారుల ఆటాపాటలకు ఇంటి యజమానికి చిర్రెత్తుకొచ్చింది. దాంతో పిల్లల గొడవ గురించి భర్త రామకృష్ణతో అనేకసార్లు ఘర్షణకూ దిగాడు.

ఆమెపై ఇంటి యజమానులు చేయి చేసుకున్నారు..

ఆమెపై ఇంటి యజమానులు చేయి చేసుకున్నారు..

ఈ నెల 4వ తేదీన రామకృష్ణ ఓ వివాహ వేడకకు హాజరయ్యేందుకు ప్రకాశం జిల్లా అడవిపాలెం వెళ్లాడు. చిన్నారులతో సుజాత ఇంట్లోనే ఉంది. ఆదివారం సాయంత్రం పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటుండగా, ఇంటి యజమానులు ప్రసన్నకుమార్‌, స్నేహలత దంపతులు సుజాతతో గొడవకు దిగారు.ఆగ్రహం కట్ట తెంచుకోవడంతో సుజాతపై చేయి చేసుకున్నారుట. దాంతో భర్తకు ఫోన్‌చేసింది. ఇంటి ఓ నర్‌ దంపతులు చేసిన గొడవను వివరించింది.

ఇంటి గోడపై సూసైడ్ నోట్ రాసిన సుజాత

ఇంటి గోడపై సూసైడ్ నోట్ రాసిన సుజాత

ఇంటి గోడలు, తలుపులపై తన చావుకు ఓనర్‌ దంపతులు ప్రసన్నకుమార్‌, స్నేహలత కారణమని, వారు తనపై మ్యాన్‌హ్యాండ్లింగ్‌ చేశారంటూ స్కెచ్‌పెన్‌తో రాసింది. భర్తలేని సమయంలో వచ్చి కొట్టడాన్ని తట్టుకోలేకపోయానని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, ‘వాళ్లకు శిక్ష నేనే వేస్తాను' అంటూ పలుచోట్ల రాసింది. అర్ధరాత్రి సమయంలో కరెంటుతీగతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.కాగా సుజాత తమతో గొడవకు దిగిందంటూ ఇంటి యజమాని ప్రసన్నకుమార్‌ ఆదివారం రాత్రి రామకృష్ణకు ఫోన్‌చేశాడు. ఇల్లు ఖాళీ చేయమంటూ స్పష్టంచేశాడు. తాను హైదరాబాద్‌ వచ్చాక విషయాలు మాట్లాడుకుందామంటూ రామకృష్ణ చెప్పారు.

భర్త ఇంటికి వచ్చి చూసే సరికే...

భర్త ఇంటికి వచ్చి చూసే సరికే...

సోమవారం ఉదయం జరిగే పెళ్లివేడుకలో రామకృష్ణ పాల్గొనకుండా ఇంటి యజమాని, భార్య ఫోన్లు చేయడంతో ఆదివారం రాత్రే హైదరాబాద్‌కు బయల్దేరాడు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చాడు. ఎంత పిలిచినా భార్య తలుపు తెరవకపోయేసరికి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లిచూడగా సుజాత మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని భార్య స్నేహలతను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇంటి యజమాని ప్రసన్నకుమార్‌ పరారీలో ఉన్నాడు. సుజాత మృతదేహంతో ఆమె కుటుంబ సభ్యులు ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ దారుణానికి కారకులైన దంపతులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+