అయ్యో అయ్యయ్యో.. ఇఫ్తార్‌ విందుకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో భారీ చోరీ

పవిత్ర రంజాన్ మాసాన్ని టార్గెట్ గా చేసుకున్న దొంగలు.. ఓ ముస్లిం కుటుంబం ఇఫ్తార్ విందుకు వెళ్ళిన సమయంలో ఇంటిని లూటీ చేసేశారు. 34 తులాల బంగారం ఆభరణాలతో పాటు సుమారు రూ 4.5 లక్షల నగదు, ఫారెన్ కరెన్సీని దోచుకెళ్లారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన మహ్మద్ ముజాహిద్ కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు. రీసెంట్ గానే హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అయితే నిన్న రాత్రి పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఇంటికి తాళం వేసి ఇఫ్తార్ విందుకోసం బందువుల ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చేసరికి.. ఇంటి వెనక తలుపు పగలగొట్టి ఉండడం గమనించారు.

massive-theft-at-home-while-they-are-go-to-iftar-dinner-at-hyderabd

అలానే ఇంట్లోని రెండు బెడ్రూంలలో అల్మారాలు పగలగొట్టిన దుండగులు 34 తులాల బంగారు ఆభరణాలతో పాటు సుమారు రూ 4.5 లక్షల నగదు, 550 కెనడియన్‌ డాలర్లు ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు అందుకున్న ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ తో పాటు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోని సీసీ కెమెరాలు, డీవీఆర్ ధ్వంసం చేసినట్లు గుర్తించారు.

దీంతో వాటి ఇంటికి సమీపంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఊహించని ఘటనతో స్థానికంగా దుమారంగా మారింది. భక్తిశ్రద్దలతో ఉపవాసం ఉంటూ రంజాన్ మాసాన్ని పవిత్రంగా జరుపుకుంటారు. దుండగులు ఈ సమయాన్ని టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఊహించని ఘటనతో ముస్లిం వర్గీయులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+