కొంచెం కష్టపడితే చాలు.. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలలో ముఖ్యఘట్టమైన రంగం నేడు కొనసాగింది. ఈరోజు రంగం కార్యక్రమం ఉదయం 9:40 నిమిషాలకు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ రంగంలో భవిష్యవాణిలో అమ్మవారు ఏం చెప్పారు అన్నది వినేందుకు ఆసక్తి చూపించారు. ఈరోజు భవిష్యవాణి నేపథ్యంలో ఆలయానికి భక్తజనం పోటెత్తారు.

భవిష్య వాణి చెప్పిన స్వర్ణలత
లష్కర్ బోనాల రెండు రోజుల జాతరలో రంగం కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నేడు రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడిపంటలతో ప్రజల సుభిక్షంగా ఉంటారని తెలిపారు. తాను ఈసారి చాలా సంతోషంగా ఉన్నానని, నాకు కావలసిన పూజలన్నీ చేస్తున్నారని భవిష్యవాణిలో తెలిపారు.

Matangi Swarnalata said Bhavishya vani in rangam in Ujjaini Mahankali Lashkar Bonalu

ఐదు వారాల పాటు అలా చెయ్యాలని కోరిక
బోనం నాకు ఎవరు తెచ్చిన ఆనందమే అంటూ వెల్లడించారు. నన్ను చూడాలంటే 48 గంటల కష్టం అంటున్నారు.. ఆ మాత్రం కష్టపడలేరా అంటూ ప్రశ్నించారు. ఎవరేం తెచ్చిన ఆనందంగా తీసుకుంటానని, ఎలాంటి జబ్బులు రాకుండా చూసుకుంటానని రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తనకు ఐదు వారాలపాటు పప్పు బెల్లం తోటి సాక పెట్టాలని కోరారు. రోగాలతో బాధపడే వారికి తాను అండగా ఉంటానని చెప్పారు.

పాడిపంటలు సమృద్ది చేస్తానని వెల్లడి
గర్భిణీ స్త్రీలకైనా, బాలలకైనా, ఎటువంటి వారికైనా ఆటంకం రాకుండా చూసుకుంటానని చెప్పారు. ప్రజలందరితో తన రూపాన్ని తప్పకుండా పెట్టించుకుంటానని, తన రూపాన్ని నిలబెట్టుకుంటానని భవిష్యవాణిలో తెలిపారు. పాడిపంటలు సమృద్ధి చేస్తే రోగాలు రాకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఇక భవిష్యవాణి నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత చెప్పిన అన్ని అంశాలను శ్రద్ధగా విన్నారు.

మహంకాళీ అమ్మవారి ఆలయంలో నేడు వేడుకలిలా
రంగం కార్యక్రమం నేపథ్యంలో ఈరోజు ఉదయం మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు. భవిష్యవాణి అనంతరం అమ్మవారి అంబారీ ఊరేగింపు వైభవంగా సాగుతుంది. ఇక ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు పలహారం బండ్ల ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి లష్కర్ బోనాలు కార్యక్రమంలో రంగంలో తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సమృద్ధిగా ఉంటుందని ప్రజలంతా సుభిక్షంగా జీవిస్తారని చెప్పడం అందరికీ కాస్త రిలీఫ్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+