ఎక్మోపై మెడికో ప్రీతి.. నిమ్స్ హెల్త్ బులెటిన్; మెడికో సైఫ్ ఫోన్లో వేధింపుల ఆధారాలు!!

వరంగల్ పీజీ వైద్య విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సైఫ్ మొబైల్ లో ప్రీతిని వేధింపులకు గురి చేసినట్టు ఆధారాలు లభించాయి.

కాకతీయ మెడికల్ కళాశాలలో చదువుతున్న సీనియర్ మెడికో సైఫ్ వేధింపులకు గురి చేశాడని పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడిన ప్రీతి ఆరోగ్యం చాలా క్రిటికల్ గా ఉందని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డాక్టర్ ప్రీతి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై ఉందని నిమ్స్ వైద్యులు బులెటిన్‌లో పేర్కొన్నారు.

డాక్టర్ ప్రీతికి ఎక్మోపై చికిత్స చేస్తున్న వైద్యులు

డాక్టర్ ప్రీతికి ఎక్మోపై చికిత్స చేస్తున్న వైద్యులు

అయితే ఆమె కిడ్నీలు, మరియు గుండె పనితీరులో కొంత మెరుగుదల కనిపిస్తుందని బులెటిన్ లో పేర్కొన్నారు. నిపుణులైన వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని పరిశీలిస్తుందని, ప్రీతిని కాపాడడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం డాక్టర్ ప్రీతికి ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని, చికిత్సకు ఆమె శరీరం స్పందిస్తుందని వైద్యులు స్పష్టం చేశారు. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో ఎక్మోపై చికిత్స అందిస్తున్నామన్నారు.

ప్రీతి ఆత్మహత్య కేసును సీరియస్ గా తీసుకున్న వరంగల్ కమీషనరేట్ పోలీసులు

ప్రీతి ఆత్మహత్య కేసును సీరియస్ గా తీసుకున్న వరంగల్ కమీషనరేట్ పోలీసులు

ప్రస్తుతం ప్రీతికి చికిత్స అందిస్తున్న వైద్యుల బృందంలో కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ తో పాటు అనస్థీషియాలజిస్ట్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు వరంగల్ కమిషనరేట్ పోలీసులు. ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ నేడు వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. మొన్న ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న, పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో ప్రీతిని వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ మెడికో సైఫ్ పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.

మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో సీపీ రంగనాథ్.. ప్రీతిని వేధించినట్టు ఆధారాలు

మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో సీపీ రంగనాథ్.. ప్రీతిని వేధించినట్టు ఆధారాలు

ఈ క్రమంలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై విచారణ నిమిత్తం వరంగల్ సిపి రంగనాథ్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. మెడికో సైఫ్ పై కేసు నమోదు చేసిన విషయంపై కూడా చర్చించినట్లు సమాచారం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా ర్యాగింగ్ నిరోధక చట్టం కింద సైఫ్ పై కేసు నమోదు చేశారు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో ప్రొఫెసర్లు డాక్టర్ ఉపేందర్, డాక్టర్ సరళ దేవి, డాక్టర్ బిక్షపతి రావు, ప్రొఫెసర్ డాక్టర్ విశ్వనాథ్ లతో నియమించిన కమిటీ విచారణ జరిపి నివేదికను సమర్పించింది. ప్రీతిని ఉద్దేశించి కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాలలో కించపరిచేలా పోస్టులు పెట్టడం వల్ల ఆమె మనస్థాపానికి గురైందని వారు నివేదికలో వెల్లడించారు. మరోవైపు సైఫ్ మొబైల్ లో ప్రీతిని వేధించినట్టు ఆధారాలు కూడా లభించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+