మెగాస్టార్ చిరంజీవి ఇంట స్పెషల్ వినాయక చవితి.. ఎందుకంటే!!
వాడవాడలా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో గణనాధుని పూజిస్తున్నారు. చ చిన్నా పెద్దా, పేద ధనిక అన్న తారతమ్యం లేకుండా అంతా సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. ఇక వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుడి శుభ దృష్టి మన రాష్ట్రంపై ఉండాలని, విఘ్నాలన్నీ తొలగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈసారి వినాయక చవితి తమకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితి పర్వదినాన ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడిని పూజించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లింకారాతో కలిసి మెగాస్టార్ చిరంజీవి తమ ఇంట్లో వినాయక చవితి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసిన చిరంజీవి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ట్విట్టర్ వేదికగా కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి పండుగ జరుపుకున్న ఫోటోలను షేర్ చేసిన చిరంజీవి ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. ఈసారి వినాయక చవితి తమకు చాలా ప్రత్యేకమైనదని చెప్పారు చిరంజీవి.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 18, 2023
ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! 🙏
ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం 😍😊
Happy Ganesh Chaturthi to ALL ! Celebrating the… pic.twitter.com/FeaFOtDdhd
ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మనవరాలు పుట్టిన తర్వాత జరుగుతున్న తొలి వినాయక చవితి కావడంతో ఈ గణేశ చతుర్థి పండుగ తమకు చాలా స్పెషల్ అని చిరంజీవి చెప్పారు.












Click it and Unblock the Notifications