తెలంగాణాలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరిన మెగాస్టార్ చిరంజీవి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో వివిధ పార్టీల తరపున ఎన్నికల బరిలోకి దిగిన వారి కోసం సినీ సెలబ్రిటీలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇక సినీ సెలబ్రిటీలు వారి సమీప బంధువులకు మద్దతుగా కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఏపీ బిజెపి కోసం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కోసం ప్రచారం చేశారు.

ఎన్నికల ప్రచారంలో సినీ సెలబ్రిటీలు
విక్టరీ వెంకటేష్ తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ ను గెలిపించాలని రోడ్ షో చేశారు.ఏపీలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తుంది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం చేశారు.

Megastar Chiranjeevi wanted chevella bjp candidate konda vishweshwar reddy to win in Telangana

బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరిన చిరంజీవి
ఇక మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. జనసేనానికి మద్దతు ప్రకటించారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణా లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ళ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉత్తముడు
కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనకు ఎంతో కాలంగా మిత్రుడని చిరంజీవి తెలిపారు. తన కోడలు ఉపాసన ద్వారా కూడా తనకు ఆయన దగ్గర బంధువని చిరంజీవి వెల్లడించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంతో ఉత్తముడని, సౌమ్యుడు అని, అందరికీ అందుబాటులో వ్యక్తి అని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారని, ఉన్నత విద్యావంతుడు అని చిరంజీవి కితాబిచ్చారు.

ఆయనను గెలిపించండి : చిరంజీవి విజ్ఞప్తి
అటువంటి వ్యక్తి సమాజ సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఆయన చేసిన సేవ అందరికీ తెలిసిందే అని పేర్కొన్న చిరంజీవి, చేవెళ్ల ఓటర్లు తమ విలువైన ఓట్లను విశ్వేశ్వర్ రెడ్డికి వేసి ఆయనను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఎప్పుడూ మంచి వ్యక్తులను గెలిపించుకుంటేనే సమాజం బాగుపడుతుందని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+