భార్యను చంపి మెదడు తీసి పొట్టేలును కోసి కుప్పలు వేశానన్నాడు

మహబూబ్‌నగర్: మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి భార్యను నరికి చంపి విచిత్రంగా ప్రవర్తించాడు. మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో శనివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎత్తం గ్రామానికి చెందిన బాలస్వామి (50) కొన్నాళ్లుగా మితిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు.

శుక్రవారం ఉదయం భార్య చంద్రమ్మతో పాటు సింగపట్నం సంగమేశ్వర గ్రామీణ బ్యాంకుకు వెళ్లి రూ. 40 వేల పంట రుణం తీసుకుని వచ్చాడు. రాత్రి పడుకునే సమయంలో బాగానే ఉన్నాడు. అయితే, అర్థరాత్రి సమయంలో నిద్రలో ఉనన భార్య చంద్రమ్మ (46)ను తల నరికి చంపాడు.

 Mentally disabled man kills wife in Mahaboobnagar district

తలలో మెదడు తీసుకుని శనివారం ఉదయమే ఇంటి ముందు కూర్చుని తాను పొట్టేలును కోసి కుప్పలు వేశానని చుట్టుపక్కలవారికి చూపించాడు. దీంతో గ్రామస్థులు ఇంట్లోకి వెళ్లి చూడగా అసలు దారుణం వెలుగు చూసింది. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలస్వామిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలావుంటే, నల్లగొండ జిల్లా మిర్యాలగుడా మండలం ఐలాపురం గ్రామం చెరువులో పడి ఓ చిన్నారి మృతి చెందగా, ముగ్గురు చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. గ్రామానికి చెందిన నలుగురు 7,9 ఏళ్ల మధ్య వయస్సు గల చిన్నారులు శనివారంనాడు ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లారు.

నీటిలో దిగగా లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతున్న క్రమంలో అక్కడే ఈత కొడుతున్న తేజావత్ విష్ణు ముగ్గురు చిన్నారులను కాపాడాడు. ఈ లోపు తేజావత్ దేవేందర్ అనే ఆరేళ్ల చిన్నారి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+