వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తనతో ఘర్షణకు దిగారన్న కక్షతో బెంజ్ కారుతో బైక్ ఢీ: మహిళ మృతి!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కారు రోడ్డు పై వెళ్తుండగా పక్క నుంచి బైక్ లపై వెళుతున్న వాహనదారులపై బురద నీళ్ళు పడటంతో భార్యాభర్తలు, వారి బంధువులు సదరు కారును ఆపి, కారు నడుపుతున్న వ్యక్తితో గొడవకు దిగారు. దీంతో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఆ కక్ష మనసులో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా బైక్ పై వెళ్తున్న సదరు భార్యాభర్తలను బెంజ్ కార్ తో గుద్దిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

ఉద్దేశపూర్వకంగా కారుతో బైక్ ను గుద్దిన ఘటన

ఉద్దేశపూర్వకంగా కారుతో బైక్ ను గుద్దిన ఘటన

ఇక ఈ కేసు విషయానికి వస్తే ఎర్రగడ్డకు చెందిన మరియా మీర్ తన భర్తతో కలిసి డిసెంబర్ 19వ తేదీన గచ్చిబౌలిలోని ఏఐజీ వద్దకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మరియా మీర్ ఆమె భర్త సయ్యద్ సైఫుద్దీన్ జావిద్, అతని తమ్ముడు సయ్యద్ మిన్హాజుద్దీన్, వారి బంధువు రషాద్ మిస్బావుద్దీన్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు రెండు బైక్ లపై బయలుదేరి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఉద్దేశపూర్వకంగా వారిని గుద్దిన ఘటన చోటు చేసుకుంది.

బురదనీళ్ళు పడటంతో బెంజ్ కారు నడిపిన వ్యక్తితో గొడవ.. దాడి

బురదనీళ్ళు పడటంతో బెంజ్ కారు నడిపిన వ్యక్తితో గొడవ.. దాడి

డిసెంబర్ 19 వ తేదీన వారికి కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి వైపు వెళుతుండగా నల్లటి మెర్సిడెస్ బెంజ్ కారు లో నిందితుడు రాజ సింహారెడ్డి అతివేగంతో తమను దాటుకొని మురికి నీళ్లు నలుగురి పైన పడేలాగా వాహనం నడిపాడు. దీంతో అతడిని వెంబడించి పట్టుకున్న నలుగురు అతనిని ఆపి ఘర్షణ కు దిగారు. రోడ్డుపైన వెళ్లేటప్పుడు చూసుకో వద్ధా? మురికి నీళ్లు అంతా తమ పైన పడేలాగా ఎందుకు వాహనం నడిపారు? కళ్ళు నెత్తిమీద ఉన్నాయా? అంటూ అతనితో గొడవ పడ్డారు. ఆపై అతనిపై దాడి చేశారు.

కక్షతో కారుతో గుద్ది వెళ్ళిపోయిన వ్యక్తి.. మహిళ మృతి

కక్షతో కారుతో గుద్ది వెళ్ళిపోయిన వ్యక్తి.. మహిళ మృతి


ఆ తర్వాత వారి వాహనాలు ముందుకు వెళ్ళనిచ్చి తనతో ఘర్షణ కు దిగారు అన్న అన్న ఆగ్రహంతో ఉన్న రాజసింహారెడ్డి కక్షతో ఉద్దేశపూర్వకంగా వారి బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో మరియ మీర్ దంపతులు కిందపడిపోయారు. ఇక వారిని ఢీ కొట్టిన తర్వాత రాజ సింహారెడ్డి అక్కడి నుండి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా డిసెంబర్ 20వ తేదీ మంగళవారం రాత్రి మరియా మీర్ మరణించారు. దీంతో పోలీసులు రాజసింహ రెడ్డిపై భారత శిక్షాస్మృతి ఐపిసి 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు రాయదుర్గం పోలీసులు తెలిపారు.

బీజేపీ ట్రాప్ లో మల్లారెడ్డి? మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతి వెనుక అధిష్టానం; బిగ్ స్టోరీ!!బీజేపీ ట్రాప్ లో మల్లారెడ్డి? మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతి వెనుక అధిష్టానం; బిగ్ స్టోరీ!!

English summary
A family got into a fight with a man who caused drain water to fall on them while driving a benz car while going on the road. A woman died when he hit their bike with his Benz car after arguing with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X