Weather Update: వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు..
తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించి 20 రోజులు దాటినా.. అంతగా వర్షాలు కురవడం లేదు. కొన్ని రోజులుగా రుతుపవనాలు బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తాజా రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని వివరించింది. దీంతో రుతుపవనాలు బలపడుతున్నట్లు పేర్కొంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ గుర్తించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వచ్చే రెండు రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.

హైదరాబాద్ లోనూ వచ్చే రెండు రోజులు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, హనుమకొండ, వరంగల్, వికారాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబ్ నగర్, నారాయణపేట, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, హనుమకొండ, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది.
శక్రవారం అత్యధికంగా జగిత్యాల జిల్లా కోల్వాయిలో 60 మీల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో 36 మీల్లీమీటర్లు, హనుమకొండ జిల్లా నడికుడలో 26 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గత రెండు మూడు రోజుల నుంచి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. 3, 4 రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశమంతా రుతుపవనాలు విస్తరించినట్టు ఐఎండీ ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో ఆ మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఢిల్లీలో భారీ వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications