ఐ ఫోన్ యాపిల్ ఛాలెంజ్.. ఆ లోపాలు చూపిస్తే 7 కోట్ల బహుమానం..!
హైదరాబాద్ : ఐ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ కంపెనీ భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. ఏ రంగంలో కూడా ఇదివరకు ఎన్నడూ లేనంతగా, ఎవరూ ప్రకటించనంతగా పెద్దమొత్తంలో బహుమతి ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఐ ఫోన్లతో పాటు ఆ కంపెనీ తయారుచేసే కొన్ని ప్రొడక్ట్స్‌లో సైబర్ నేరాలు, హ్యాకింగ్‌కు ఛాన్స్ కల్పించే లోపాల్ని గుర్తించిన వారికి ఒక మిలియన్ డాలర్లను (ఇండియన్ కరెన్సీలో దాదాపు 7 కోట్ల రూపాయలు) బహుమానంగా అందించనున్నట్లు వెల్లడించింది. ఐ ఫోన్లు వాడుతున్న వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఆయా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అపహరిస్తున్నాయని వివిధ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ క్రమంలోనే యాపిల్ ఇంత పెద్దమొత్తంలో భారీ బహుమానం ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇంత పెద్దమొత్తంలో ప్రైజ్‌మనీ ప్రకటించిన యాపిల్ కంపెనీ కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. వినియోగదారుడి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా వారి ఫోన్లలోకి ప్రవేశించి.. లోపాలను కనుగొన్న వారికి మాత్రమే ఈ బహుమానమంటూ వెల్లడించింది. అయితే ఇదివరకు చిన్నపాటి బగ్స్ కనుగొన్నవారికి యాపిల్ కంపెనీ 20 వేల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు 14 లక్షల రూపాయలు) అందిస్తూ వచ్చింది. సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్న తరుణంలో యాపిల్ సంస్థ.. ముందు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది.

విహార యాత్రకు వెళ్లారా మంత్రి గారు.. వరద బాధిత ప్రాంతాల్లో సెల్ఫీలా..! (వీడియో)
సంస్థ ప్రొడక్ట్స్‌లో లోపాల్ని పరిశోధించే ప్రక్రియలను సైతం ఈజీ చేస్తోంది యాపిల్ కంపెనీ. ఆ నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు తొలగించిన ఐ ఫోన్లను పరిశోధకులకు అందిస్తోంది. దాంతో హ్యాకర్లకు అనుకూలించే లోపాలు పసిగట్టే అవకాశం ఏర్పడుతుందనేది ఒక అంచనా. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఆయా దేశాలు సరికొత్త టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నాయి. అదే క్రమంలో యాపిల్ సంస్థ ఇలాంటి చర్యలు తీసుకుంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఇంత పెద్ద మొత్తం సొంతం కావాలంటే.. ఐఫోన్‌తో పాటు మ్యాక్ సాఫ్ట్‌వేర్, ఇతర యాపిల్ ఉత్పత్తుల్లో హ్యాకింగ్ అవకాశం కల్పించే లోపాల్ని కనుగొనాల్సి ఉంటుంది. ఆ మేరకు గురువారం లాస్‌వెగాస్‌లో జరిగిన బ్లాక్ హ్యాట్ సెక్యూరిటీ సదస్సులో భారీ మొత్తం ప్రైజ్‌మనీ యాపిల్ ప్రకటించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications