పవన్ కళ్యాణ్‌పై కార్యకర్త ఫిర్యాదు
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఎంఐఎం నేత ముబాషీర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నగర పోలీస్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్‌కు ట్విట్టర్(ఎక్స్)లో పెట్టారు. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారు అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారు అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు.
తమను అవమానించేలా కామెంట్స్ చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని కంప్లైంట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమి తరపున మహారాష్ట్రలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాందేడ్ జిల్లా దెగ్లూరులో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉండే కొందరు నేతలు పోలీసులు 15 నిమిషాల పాటు కళ్లు మూసుకుంటే హిందువులకు మేమేంటో చూపిస్తామని అంటారు. మనకు ఇలాంటి ప్రభుత్వాలు వద్దని.. ఎన్నికల్లో విడిపోయి బలహీనపడదామా? లేకపోతే కలిసి బలంగా నిలబడదామని పవన్ కళ్యాణ్ అన్నారు.

విడిపోయి హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా? లేకపోతే కలిసి బంగారు భవిష్యత్తును నిర్మించుకుందామని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో ఎంఐఎం నేత ముబాషీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే దీనిపై హైదరాబాద్ సీపీ ఆనంద్ స్పందించారు. దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అంటూ ఎంఐఎం నేతకు సమాధానం ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన ఎంఐఎం కార్యకర్త
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2024
హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారు అంటూ అవమానించినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు చేయాలి అంటూ ఫిర్యాదు చేసిన ఎంఐఎం కార్యకర్త.
దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అంటూ సమాధానం ఇచ్చిన… pic.twitter.com/PgVvJgZ7J1












Click it and Unblock the Notifications