• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఐఎం నేతలు రేపులు చేస్తుంటే టీఆర్ఎస్ నేతలు హత్యలు చేస్తున్నారు.!బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసును పోలీసులు పూర్తిగా నీరుగార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అత్యాచారం కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ గల్లంతు చేసిన తరువాతే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేశారని తీవ్ర విమర్శలు చేసారు. అత్యాచారం జరిగిన ఘటన రోజు నుండి కేసు నమోదు చేయడంలో పోలీసులు కావాలనే జాప్యం చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. కేసును తప్పు దోవ పట్టించేందుకు, ఈ కేసులో హిందువు ఉన్నట్లు చిత్రీకరించేందుకు మొదటి ఎఫ్ఐఆర్ లో సూరజ్ అనే పేరు నమోదు చేశారన్నారు బీజేపి ఛీఫ్.

 మైనర్ బాలికపై అత్యాచారం ప్రీ ప్లాన్ కుట్ర.. పోలీసులు వాస్తవాలు దాస్తున్నారన్న బండి సంజయ్

మైనర్ బాలికపై అత్యాచారం ప్రీ ప్లాన్ కుట్ర.. పోలీసులు వాస్తవాలు దాస్తున్నారన్న బండి సంజయ్

మైనర్ బాలిక రేప్ అంశంలో పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని సర్వీసింగ్ చేసి.. ఆధారాలన్నీ గల్లంతయ్యాయని నిర్దారణ చేసుకున్నాకే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేయడంతో పాటు నిందితుల జాబితాలో చివరన చేర్చారని చెప్పారు. బీజేపీ ఉద్యమించడంవల్లే పోలీసులు ఈ మాత్రం స్పందించారని, లేనిపక్షంలో కేసును మూసేసేవారని బండి సంజయ్ స్పష్టం చేసారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుదవారం జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే రఘు నందన్ రావు పాల్గొన్నారు.

 ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయత్నం.. కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ

ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయత్నం.. కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ


జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో చివరి వరకు ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయత్నించిందన్నారు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దోషులను కాపాడేందుకు కేసును నీరుగార్చిందన్నారు. బీజేపీ ఆందోళన చేయడంవల్లే పోలీసులు ఈ మాత్రమైనా స్పందిస్తున్నారు. సీఎం చంద్రవేఖర్ రావు చేతగానితనంవల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. ఫాంహౌజ్ కే సీఎం పరిమితమయ్యారని, గత పది రోజులుగా రోజుకో ఘటన వెలుగు చూస్తున్నా, పోలీసులు, ప్రభుత్వం స్పందించడం లేదని, రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? సీఎం ఉన్నారా?అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు తరుణ్ చుగ్.

 పోలీసులు పొంతనలేని ప్రకటనలు.. కావాలనే ఆధారాలు తుడిచేసారన్న బండి సంజయ్

పోలీసులు పొంతనలేని ప్రకటనలు.. కావాలనే ఆధారాలు తుడిచేసారన్న బండి సంజయ్


జూబ్లిహిల్స్ కేసులో పోలీసులు పరస్పర విరుద్దంగా మాట్లాడుతున్నారని, ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం లేదని డీసీపీ జోయల్ డెవిస్ చెబితే, నిన్న పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాత్రం ఎమ్మెల్యే కొడుకుపైనా కేసు నమోదు చేశామని చెప్పారని బండి సంజయ్ గుర్తు చేసారు. ఆధారాలన్నీ గల్లంతు చేసిందుకు సర్వీసింగ్ చేసింది పోలీసులేనని, పూర్తి కాలయాపన చేసి ఆధారాలు దొరకకుండా నీరుగార్చి నిజమైన నిందితులను చివరి పేరులో చేర్చి చట్టానికి భిన్నంగా వ్యవహరించారని, ఈ కేసులో మెజిస్ట్రేట్ ఎదుట బాలిక స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సినప్పటికీ సకాలంలో చేయలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

 కేసీఆర్ కుటుంబం స్పందిస్తే తప్ప పోలీసులు స్పందించరు.. శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయన్న బీజేపి

కేసీఆర్ కుటుంబం స్పందిస్తే తప్ప పోలీసులు స్పందించరు.. శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయన్న బీజేపి


ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చి ఆదేశాల మేరకే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లను కాపాడేందుకు పోలీసులు కేసును నీరుగార్చారని, పైకి మాత్రం నిందితులకు 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందంటూ ప్రజలను నమ్మించేందుకు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ వివరించారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి రాష్ట్రాన్ని పంచుకున్నయని, ఎంఐఎం నాయకులు అత్యాచారాలు చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులు హత్యలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో అత్యాచారాలు చేస్తే కళ్లు పీకేస్తామన్న సీఎం ఏమైండు? చూడటానికి సీఎంకే కళ్లు లేవు, ఇక దోషుల కళ్లేం పీకుతడని ఎద్దేవా చేసారు బండి సంజయ్.

English summary
BJP state president and MP Bandi Sanjay Kumar was angry that the police had completely neglected the rape case of a Jubilee Hills minor girl. It has been strongly criticized that the case was registered against the MLA's son only after all the evidence related to the rape case was falsified.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X