సీఎం కేసీఆర్ తెలంగాణా గాంధీ; మార్చి తర్వాత తెలంగాణాలో ఉచితవిద్య, వైద్యం: మంత్రి ఎర్రబెల్లి

రాబోయే రోజుల్లో మార్చి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్య, వైద్యం అందించాలని సీఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. సీఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని ఆయన కితాబిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుపడుతున్నారని, పల్లెలు స్వయం సమృద్ధిగా ఎదిగాయని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచాయన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.

Recommended Video

    Bheem Deeksha : KCR కు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదన్న మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ | Oneindia Telugu

    సీఎం కేసీఆర్ తెలంగాణా గాంధీ

    సీఎం కేసీఆర్ తెలంగాణా గాంధీ

    దళిత బంధు పథకానికి 20 వేల కోట్లు పెట్టి, ప్రతి దళిత బిడ్డను ఆదుకోవాలని సీఎం నిర్ణయించారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కెసిఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసిఆర్ తెలంగాణ గాంధీ అంటూ ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించారు. గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని ఆదర్శంగా చెప్పారు. ఆయన చెప్పిన ఆదర్శాన్ని సీఎం కెసిఆర్ ఆచరణలో పెట్టారని కితాబిచ్చారు.

     కేసీఆర్ వల్లే తెలంగాణా అభివృద్ధి .. జన్మదిన వేడుకలు చెయ్యండి

    కేసీఆర్ వల్లే తెలంగాణా అభివృద్ధి .. జన్మదిన వేడుకలు చెయ్యండి

    దేశంలో 70 ఏళ్లు గా గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని సీఎం కెసిఆర్ వచ్చాక గ్రామాలన్నీ పచ్చగా నిండుగా విలసిల్లుతున్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు . తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ జన్మ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలు, దివ్యాంగులకు, రోగులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేయాలి. రక్తదాన కార్యక్రమం నిర్వహించాలి. 17న మొక్కలు నాటడం. సర్వమత ప్రార్థనలు చేయాలి. సీఎం కెసిఆర్, ఆయన కుటుంబం చల్లగా ఉండాలి అని కోరుకున్నారు. ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రం బాగు పడిందని చెప్పుకొచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

     తెలంగాణా వస్తే ఏం వస్తది అన్నోళ్ళకు కేసీఆర్ చేసిన అభివృద్ధి చెంప పెట్టు

    తెలంగాణా వస్తే ఏం వస్తది అన్నోళ్ళకు కేసీఆర్ చేసిన అభివృద్ధి చెంప పెట్టు

    తెలంగాణ వచ్చాక ఏం వస్తది? అన్నోళ్ళకు సీఎం కెసిఆర్ గారి అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం. మొన్నటి జనగామ సభలో సీఎం కెసిఆర్ పాలకుర్తి నియోజకవర్గం పై వరాల జల్లు కురిపించారని పేర్కొన్నారు.పాలకుర్తి, తొర్రూరు హాస్పిటల్ లను 100 పడకల హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయనున్నామని, కొడకండ్ల, రాయపర్తి, దేవరుప్పుల హాస్పిటల్స్ గా అప్ గ్రేడ్ చేయనున్నామని వెల్లడించారు. పెద్ద వంగర లో కొత్త హాస్పిటల్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి

     కొడకండ్ల టెక్స్ టైల్ పార్క్ ప్రపోజల్ .. జనగామకు మెడికల్ కాలేజ్

    కొడకండ్ల టెక్స్ టైల్ పార్క్ ప్రపోజల్ .. జనగామకు మెడికల్ కాలేజ్

    కొడకండ్ల లో కొత్తగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరానని, ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లు త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జనగామ కు మెడికల్ కాలేజ్ ఇస్తామని సీఎం కెసిఆర్ ప్రకటించారు. స్టేషన్ ఘనపూర్ లో డిగ్రీ కాలేజ్, పాలకుర్తిలో జూనియర్, డిగ్రీ కాలేజ్ కు అనుమతులు...ఇప్పిస్తామని సీఎం చెప్పారని దయాకర్ రావు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+