టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి మండిపాటు!!
టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ సీఎం కెసిఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటల ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ అమెరికాలో NRI మీట్ అండ్ గ్రీట్ లో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాలో వున్న మంత్రి ఎర్రబెల్లి ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడిన మంత్రి ఎర్రబెల్లి రైతులకు ఉచిత విద్యుత్ అందించే పథకాలలో కూడా ఏమి రాజకీయం ఉందో ప్రతిపక్షాలకు తెలియాలంటూ విమర్శలు గుప్పించారు. రైతులు పంట పండించుకోవడానికి ఉచిత కరెంటు ఇస్తే తప్పా అని ప్రశ్నించారు. రోజుకు మూడు గంటల కరెంటు సరిపోతుందా? రేవంత్ రెడ్డి చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి నిలదీశారు.

మూడు గంటల కరెంటుతో వ్యవసాయం ఎలా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. మూడు గంటల కరెంటు ఇస్తే రైతులు బాగుపడతారా అంటూ మంత్రి ఎర్రబెల్లి రేవంత్ రెడ్డిని నిలదీశారు. దేశానికి రైతు వెన్నెముక వంటి వాడని, అందుకే సీఎం కేసీఆర్ ఆలోచించి రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రైతు ఉన్నతి కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.
బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రైతన్నను పట్టించుకోలేదని, రైతులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీలు రైతులను, చులకనగా చూస్తున్నాయని రైతులు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. సరైన సమయంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కొనేందుకు రాజకీయం, వడ్లు తడిస్తే రాజకీయం, తడిసిన వడ్లు కొంటే రాజకీయం, కొన్ని వడ్ల కు పైసలు ఇచ్చే దగ్గర రాజకీయం, ఇలా ఇన్ని రాజకీయాలు చేసేది కాంగ్రెస్, బిజెపి పార్టీ లేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఏ రాజకీయం లేకుండా రైతులకు న్యాయం జరగాలన్న తపనతో పథకాలు అమలు చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ అని నినదిస్తూ, రైతుల తరుపున నిలదీస్తున్న ఏకైక నేత కేసీఆర్ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కితాబిచ్చారు. కాబట్టి రైతులు ఆయనను కడుపులో పెట్టుకుని చూసుకుంటారని, రైతులు రైతు వ్యతిరేకుల మాటలు పట్టించుకోరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
-
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి!












Click it and Unblock the Notifications