వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి.. ఆసక్తికర వ్యాఖ్యలు!!

|
Google Oneindia TeluguNews

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటుచేసిన ఎనుమాముల పోలీస్ స్టేషన్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు ప్రారంభించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తోపాటు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

ఎనుమాముల పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

ఎనుమాముల పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి


వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ ఏనుమములమార్కెట్ కిఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఈ పరిధిలో నమోదవుతున్న కేసుల కోసం పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసి, శాంతిభద్రతలను పరిరక్షించడం మంచి పరిణామం అన్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ కు ఉన్న చరిత్రను కాపాడటంమనందరిబాధ్యత అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిస్థితులకు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ల పరిస్థితులకు ఎంతో మార్పు వచ్చిందన్నారు.

గతంలో పోలీస్ స్టేషన్లకు ఇప్పుడు ఎంతో తేడా

గతంలో పోలీస్ స్టేషన్లకు ఇప్పుడు ఎంతో తేడా


గత ప్రభుత్వాల హయాంలో పోలీస్ స్టేషన్లకు కనీసం మంచి వాహన సదుపాయం కూడా లేదని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత ప్రతి పోలీస్ స్టేషన్ కి ప్రభుత్వం వాహన సదుపాయాలను కల్పించడంతోపాటు ఖర్చులకు నిధులను కూడా ఇస్తుందని తెలిపారు. హోంగార్డుల జీతాలు పెంచి వారి గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం కాపాడిందని పేర్కొన్నారు. ఇక గతంలో ఏదైనా కేసును ఛేదించారు అంటే చాలా రోజుల సమయం పట్టేది అని, పోలీస్ స్టేషన్ లలో వచ్చిన అధునాతన వసతులతో ప్రస్తుతం కేసుల పరిష్కారం త్వరితగతిన అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

రైతుల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ ముందంజ

రైతుల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ ముందంజ

రైతుల సమస్యలను పరిష్కరించడానికి పోలీసుశాఖ ఎప్పుడూ ముందుంటుందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చే రైతుబంధు ఇస్తున్నారని, రైతులు బాగు పడితేనే మన రాష్ట్రం బాగు పడుతుందని ముఖ్యమంత్రి గారి ఆలోచన అంటూ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యత ను కరెక్ట్ గా నిర్వర్తించాలని పేర్కొన్న మంత్రి, ప్రజల మన్ననలు పొందడానికి పోలీస్ శాఖ వారు కృషి చేయాలన్నారు.

పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై సీపీ రంగనాథ్ వ్యాఖ్యలు

పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై సీపీ రంగనాథ్ వ్యాఖ్యలు

ఇక ఈ కార్యక్రమంలో మాట్లాడిన పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఇది కీలకమైనపోలీస్ స్టేషన్ అని పేర్కొన్నారు. చుట్టూ ఉన్న 15 గ్రామాల పేద ప్రజల కీ, రైతులకుఈ పోలీస్ స్టేషన్ వల్ల ఎంతోమేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంవేగం గా అభివృద్ధి జరుగుతున్న క్రమం లోరానున్నరోజుల్లోట్రాఫిక్, ఇతరత్రసమస్య లు కూడా త్వరగా తీర్చడం కోసంమా వైపు నుండి కృషి చేస్తామన్నారు. ప్రజలకు చేరువయ్యే ఎన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు.

ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కలెక్టర్ గోపీ ఏమన్నారంటే

ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కలెక్టర్ గోపీ ఏమన్నారంటే


వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి ఎనుమాముల పోలీస్ స్టేషన్ ఏర్పాటు పై మాట్లాడుతూ మంచిఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఈ భవనాన్నినిర్మించారన్నారు. దేశంలోనే పేరెన్నికగన్న ఎనుమాముల మార్కెట్ ఉన్న ప్రాంతంలో పోలీస్ స్టేషన్ తప్పకుండా ఉండాలని, 24 గంటల నిఘా అవసరమని పేర్కొన్నారు. ఈ పోలీస్ స్టేషన్ సమీప గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ ఆసియా లోనే అతి పెద్ద మార్కెట్ అయినఏనుమాముల మార్కెట్ లో పోలీస్ స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తూ నేడు పక్క రాష్ట్రాలకి మన పోలీసు వ్యవస్థ ఐకాన్ గా మారిందన్నారు.

విద్యుత్ రంగంలో కేసీఆర్ పీహెచ్డీ చేస్తే.. ప్రజలపై ప్రభుత్వ బకాయిల కరెంట్ బిల్లుల భారమేల?విద్యుత్ రంగంలో కేసీఆర్ పీహెచ్డీ చేస్తే.. ప్రజలపై ప్రభుత్వ బకాయిల కరెంట్ బిల్లుల భారమేల?

English summary
Minister Errabelli Dayakar Rao, who inaugurated the Warangal Enumamula Police Station, said that the conditions of the police stations in the past govts and the conditions of the police stations now have changed a lot in the state of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X