వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీలో చేరికపై మంత్రి ఎర్రబెల్లి సైలెన్స్ వ్యూహాత్మకమేనా? హాట్ టాపిక్!!

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా రచ్చ కొనసాగుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావును టార్గెట్ చేసి, చేసిన వ్యాఖ్యలతో, తాజాగా పార్టీకి రాజీనామా చేసిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు నన్నపనేని నరేందర్ కు సవాల్ విసిరారు. దీంతో సవాళ్లు ప్రతిసవాళ్లతో వరంగల్ టిఆర్ఎస్ రాజకీయం రసవత్తరంగా మారింది.

టీఆర్ఎస్ లో తమ్ముడి రాజకీయ భవిష్యత్ కోసం అన్న ఎర్రబెల్లి ప్రయత్నం..

టీఆర్ఎస్ లో తమ్ముడి రాజకీయ భవిష్యత్ కోసం అన్న ఎర్రబెల్లి ప్రయత్నం..

ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామాతో ఇటు టీఆర్ఎస్ పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలియకుండానే ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీ మారుతున్నారా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు కు గత ఎన్నికల్లో టికెట్ ఇప్పించడం కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శతవిధాల ప్రయత్నం చేశారు. ఆ పై ఎమ్మెల్సీ టికెట్ విషయంలో కూడా ప్రయత్నం చేసి విఫలమయ్యారు. టీఆర్ఎస్ పార్టీలో తమ్ముడి పదవి కోసం ఎర్రబెల్లి చెయ్యని ప్రయత్నాలు లేవు.

మంత్రి ఎర్రబెల్లికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు మధ్య వైరం ప్రదీప్ రావు విషయంలోనే

మంత్రి ఎర్రబెల్లికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు మధ్య వైరం ప్రదీప్ రావు విషయంలోనే

ఇక ఈ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తన తమ్ముడి కోసం చేస్తున్న ప్రయత్నాలతోనే స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో ఆయనకు మనస్పర్థలు మొదలయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటేనే నన్నపనేని నరేందర్ మండిపడుతున్న పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా మంత్రిగా ఎర్రబెల్లిని పిలవకుండా సత్యవతి రాథోడ్ ను ఆహ్వానిస్తున్నారు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. ఇక మంత్రి హోదాలో ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్న కార్యక్రమాలకు హాజరు కాకుండా తన వ్యతిరేకత చూపిస్తున్నారు నన్నపునేని నరేందర్.

తమ్ముడి పార్టీ మార్పుపై సైలెంట్ గా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తమ్ముడి పార్టీ మార్పుపై సైలెంట్ గా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఈ సమయంలో టీఆర్ఎస్ పార్టీకి ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామా చేయడం వ్యూహాత్మకం అన్న చర్చ స్థానికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలిసే, ఆయన కనుసన్నలలోనే ఎర్రబెల్లి ప్రదీప్ రావు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపికి వెళుతున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. అందుకే ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు పార్టీకి రాజీనామా వ్యవహారంలో, బీజేపీ లో చేరిక వ్యవహారంలో సైలెంట్ గా ఉన్నట్టు పార్టీలోను జోరుగా చర్చ జరుగుతోంది.

బీజేపీ నుండి ఎర్రబెల్లి తమ్ముడు ఎన్నికల బరిలోకి దిగితే ఎర్రబెల్లి ప్రత్యర్ధి పార్టీ కోసం పని చేస్తారా?

బీజేపీ నుండి ఎర్రబెల్లి తమ్ముడు ఎన్నికల బరిలోకి దిగితే ఎర్రబెల్లి ప్రత్యర్ధి పార్టీ కోసం పని చేస్తారా?


ఇక తమ్ముడి రాజీనామా విషయంలో మంత్రి ఎర్రబెల్లి వ్యవహారశైలి కూడా స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు రుచించడం లేదు. టిఆర్ఎస్ పార్టీ నుండి ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు టికెట్ రావడం కష్టం అని భావిస్తున్న నేపథ్యంలోనే బిజెపి నుండి బరిలోకి దిగేందుకు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లుగా సమాచారం. ఇక ఒకవేళ అదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించటంలో, తమ్ముడు కోసం అన్న ప్రత్యర్థి పార్టీ కోసం అంతర్గతంగా పనిచేస్తారు అన్న చర్చ కూడా జరుగుతుంది.

టీడీపీకి ఎర్రబెల్లి పొడిచిన వెన్నుపోటును గుర్తు చేసుకుంటున్న రాజకీయ నాయకులు

టీడీపీకి ఎర్రబెల్లి పొడిచిన వెన్నుపోటును గుర్తు చేసుకుంటున్న రాజకీయ నాయకులు

ఇక ఇదే సమయంలో గతంలో టిడిపికి వెన్నుపోటు పొడిచి టిఆర్ఎస్ కు ఏ విధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చారు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయాలలో అవసరం అనుకుంటే ఏదైనా చేస్తారు అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా తమ్ముడు చేస్తున్న రాజకీయం అన్నకు తెలియకుండానే జరుగుతుందా? సమస్యే లేదు.. ఇదంతా ఎర్రబెల్లి దయాకర్ రావు కనుసన్నల్లోనే జరుగుతుంది అని భావిస్తున్న వారు కూడా లేకపోలేదు. ప్రస్తుతం వరంగల్ తూర్పులో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

English summary
Minister Errabelli Dayakar rao silent strategy on brother Errabelli Pradeep Rao's joining BJP.. The discussion that errabelli knows everything on his brother's joining in bjp has become a hot topic in Warangal East.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X