కాంగ్రెస్ ఖాళీ.. బిజెపి డీలా.. బిఆర్ఎస్ తోనే భరోసా!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని, బిజెపి డీలా పడుతుందని, బీఆర్ఎస్ భరోసాతో తెలంగాణ ప్రజానీకం సంతోషంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం మాటేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని, బిజెపి విలవిలలాడుతోంది అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయిందని, భవిష్యత్తు భారత రాష్ట్ర సమితి దేనని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి వచ్చిన కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలకు నాయకులకు కండువాలు కప్పి స్వాగతం పలికారు.

బీజేపీతో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు

బీజేపీతో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు


బిజెపితో ఈ రాష్ట్రానికి, ఒరిగేదేమీ లేదని బీఆర్ఎస్ పార్టీతోటే అభివృద్ధి జరుగుతుందని నమ్మి భారత రాష్ట్ర సమితిలో చాలామంది చేరుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారందరినీ అభినందిస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా, ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఏ పార్టీ.. ఏ ముఖ్యమంత్రి.. ఏమేం చేశారు అనేది మనమంతా ఆలోచించుకోవాలి అన్నారు. కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఎవరూ అమలు చేయడం లేదని పేర్కొన్నారు.

కేసీఆర్ ఏం చేశారని కొందరు మార్ఖుల ప్రశ్నలు

కేసీఆర్ ఏం చేశారని కొందరు మార్ఖుల ప్రశ్నలు

అన్ని ఒకేసారి కావాలి అన్నా భగవంతుడు వల్ల కూడా కాదని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి, రాష్ట్రం కోసం ఎంతో చేస్తున్నప్పటికీ కేసీఆర్ ను కొంతమంది మూర్ఖులు ఏమి చేశారని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్లు ఎన్టీ రామారావు గారు మొదలుపెడితే, సీఎం కేసీఆర్ గారు ఆ పెన్షన్లు 2000 రూపాయలు చేశారు అని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి, ఇంకా రాష్ట్రంలో పెన్షన్ రాని వారు ఎవరైనా ఉంటే ఇప్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్నారు. దేశంలో మన రాష్ట్రంలో తప్ప ఇంతగా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రమే లేదన్నారు.

బీజేపీ ప్రభుత్వం వల్ల దేశం నాశనం

బీజేపీ ప్రభుత్వం వల్ల దేశం నాశనం


ముసలి వాళ్లకు గౌరవం ఇచ్చింది సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో రైతుల బతుకులు బాగు పడ్డాయి అన్నారు. 75 ఏళ్ల పాటు కరెంటు కోసం కొట్లాడామని, ఇప్పుడు కరెంటు కష్టాలు లేవని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. బిజెపి ది దొంగ ప్రభుత్వం అని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి బిజెపి ప్రభుత్వం వల్ల దేశం నాశనం అవుతుందన్నారు. కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టమని బలవంతం చేస్తున్నారు. కానీ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టనని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని గుర్తు చేశారు.

తెలంగాణా ప్రజలకు భరోసా బీఆర్ఎస్ మాత్రమే

తెలంగాణా ప్రజలకు భరోసా బీఆర్ఎస్ మాత్రమే


రైతులంటే సీఎం కేసీఆర్ కు ఇష్టమని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి మేనమామ వలె కళ్యాణ లక్ష్మి పథకం కింద పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్నారని గుర్తు చేశారు. కెసిఆర్ కిట్ అందిస్తూ గర్భిణీ మహిళలకు, పుట్టిన పిల్లల సంక్షేమానికి పాటు పడుతున్నారని, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల తోటి నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తున్నారు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు భరోసా ఇస్తున్నది బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి, మిగతా పార్టీలను నమ్మొద్దని హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+