వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో గెలిచిన తర్వాతే నిధులు.. మంత్రి జగదీశ్ రెడ్డి షాకింగ్ న్యూస్ చెప్పారే!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు కీలకం కావడంతో బిజెపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు వ్యూహాత్మకంగా మునుగోడులో పావులు కదుపుతూ ముందుకు సాగుతున్నాయి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఇంతకాలం కుంటుపడిన అభివృద్ధి తిరిగి కొనసాగుతుందని అంతా భావించారు. సీఎం కేసీఆర్ మునుగోడును హుజురాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తారని అటు ప్రజల్లో సైతం ప్రధానంగా చర్చ జరుగుతోంది.

నియోజకవర్గ సమస్యలను మంత్రి జగదీశ్ రెడ్డి వద్ద ఏకరువు పెడుతున్న గులాబీనేతలు

నియోజకవర్గ సమస్యలను మంత్రి జగదీశ్ రెడ్డి వద్ద ఏకరువు పెడుతున్న గులాబీనేతలు

మునుగోడు నియోజకవర్గంలో మండలాలు వారీగా ఉన్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు, ఆ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుని, 20వ తేదీన జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభలో మునుగోడు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపిస్తారు అని, నియోజకవర్గ అభివృద్ధికి శ్రీకారం చుడతారు అని అంతా భావిస్తున్నారు.

ఇక ఇదే అవకాశంగా నియోజకవర్గంలోని సమస్యలను ప్రజలు, పార్టీల నాయకులు ఏకరువు పెడుతున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, మండలాల వారీగా ఉన్న సమస్యలను జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి దృష్టికి తీసుకు వెళుతున్నారు.

పార్టీ నేతలకు మంత్రి జగదీశ్ రెడ్డి షాక్.. గెలిచాకే అభివృద్ధి నిధులిస్తామన్న మంత్రి

పార్టీ నేతలకు మంత్రి జగదీశ్ రెడ్డి షాక్.. గెలిచాకే అభివృద్ధి నిధులిస్తామన్న మంత్రి

ఈ క్రమంలో తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి అభివృద్ధి పనుల విషయంలో, మండలాల వారీగా ఇవ్వవలసిన నిధుల విషయంలో చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలకు షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన తర్వాత అన్ని గ్రామాల అభివృద్ధి నిధులు మంజూరు అవుతాయని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పడం పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడు పడడం లేదు.

చౌటుప్పల్ లో టిఆర్ఎస్ సర్పంచులు, ఎంపిటిసిలతో సమావేశమైన మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తే ప్రతిపక్షాలు దానిని అనుకూలంగా మలచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

చౌటుప్పల్ లో పరిష్కారం కాని సమస్యలు.. అభివృద్ధి పనులపై నేతల విజ్ఞప్తి

చౌటుప్పల్ లో పరిష్కారం కాని సమస్యలు.. అభివృద్ధి పనులపై నేతల విజ్ఞప్తి

చౌటుప్పల్ మండలానికి 7.50 కోట్ల నిధులను నేటికీ మంజూరు చేయడం లేదని, అలాగే సీఎం కేసీఆర్ ప్రకటించిన 25 లక్షల రూపాయల ప్రత్యేక నిధులు కూడా జిల్లాలోని అన్ని గ్రామాలకు ఇచ్చినా, తమ మండలానికి మంజూరు చేయలేదని నాయకులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నిధులు లేక గ్రామాలలో అభివృద్ధి జరగలేదని, ఈ సమయంలో గ్రామాల్లో తిరిగి ప్రజలను ఓట్లు ఎలా అడగాలని వారు ప్రశ్నించారు. తక్షణం నిధులు మంజూరు చేస్తే అభివృద్ధి పనులు మొదలు పెట్టొచ్చు అంటూ వారు సూచించారు.

ఇప్పుడే నిధులిస్తే ప్రతిపక్షాలు అనుకూలంగా వాడుకుంటాయన్న మంత్రి

ఇప్పుడే నిధులిస్తే ప్రతిపక్షాలు అనుకూలంగా వాడుకుంటాయన్న మంత్రి


అయితే వారి ప్రశ్నలను విన్న మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిధులు విడుదల చేస్తామని, ఇప్పుడు నిధులు మంజూరు చేసే ప్రతిపక్షాలు దాన్ని వారికి అనుకూలంగా మలచుకుంటారు అని పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో గెలిపిస్తే కచ్చితంగా నిధులు మంజూరు అవుతాయని, అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సూచించారు. ఇక గెలిచిన తర్వాత నిధులు మంజూరు చేసే బాధ్యత తనదేనని మంత్రి జగదీష్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.

మంత్రి వ్యాఖ్యలతో రకరకాల అనుమానాలు .. రాజకీయ వర్గాలలోనూ చర్చ

మంత్రి వ్యాఖ్యలతో రకరకాల అనుమానాలు .. రాజకీయ వర్గాలలోనూ చర్చ

ఎన్నికలకు ముందే అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు భావిస్తే, అలాకాదు ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పడం ఇప్పుడు నియోజకవర్గంలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. హుజురాబాద్ తరహాలో ముందే అభివృద్ధి చేసి ఎన్నికలకు వెళ్తారు అనుకుంటే, ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే అభివృద్ధి అని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఏదేమైనా మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అభివృద్ధి చేయకుంటే ప్రజాక్షేత్రంలోకి వెళితే ప్రజలు ఓటేస్తారా? అన్న ప్రశ్న టిఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉత్పన్నమవుతుంటే, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే మళ్లీ అభివృద్ధి శూన్యంగా మారుతుందా? అన్న ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది.

English summary
Minister Jagadish Reddy said Shocking News that funds will be given only after winning in Munugode. The minister met with Choutuppal leaders and shocked them by saying that funds will be sanctioned only after winning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X