వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్గొండజిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని పారద్రోలిన ఘనత కేసీఆర్ దే: మునుగోడుసభలో మంత్రి జగదీష్‌రెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దీవెన సభ కొనసాగుతుంది. ఈ సభలో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లా కోసం చేసిన కృషిని వివరించారు. ఒకప్పుడు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న నల్గొండ జిల్లా ఇప్పుడు కేసీఆర్ కారణంగా ఆ సమస్య నుండి బయటపడిందని అన్నారు.

రాజీనామాలతో నిధులొస్తే నలుగురు బీజేపీ ఎంపీలతో రాజీనామా చేయించండి: మునుగోడులో రేవంత్ రెడ్డి సవాల్రాజీనామాలతో నిధులొస్తే నలుగురు బీజేపీ ఎంపీలతో రాజీనామా చేయించండి: మునుగోడులో రేవంత్ రెడ్డి సవాల్

మునుగోడులో సీఎం కెసీఆర్ బహిరంగ సభలో మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు

మునుగోడులో సీఎం కెసీఆర్ బహిరంగ సభలో మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు


హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా భారీ కాన్వాయ్ తో సీఎం కేసీఆర్ మునుగోడుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున గులాబి శ్రేణులు కెసిఆర్ కు స్వాగతం పలికారు.మునుగోడు లో టిఆర్ఎస్ ప్రజా దీవెన సభ ప్రారంభమైంది. ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గులాబీ పార్టీ జెండాను ఎగురవేసి సభను ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఈ భారీ బహిరంగ సభను కెసిఆర్ ప్రారంభించారు. అయితే ఈ సభకు అధ్యక్షత వహించిన మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పనితీరు కితాబిచ్చారు.

గతంలో నల్గొండజిల్లాలో దీన పరిస్థితులు.. కేసీఆర్ వల్లే ఇప్పుడు సస్య శ్యామలం గా

గతంలో నల్గొండజిల్లాలో దీన పరిస్థితులు.. కేసీఆర్ వల్లే ఇప్పుడు సస్య శ్యామలం గా


2014 కు ముందు మునుగోడులో దీన పరిస్థితులు ఉండేవని, ఎడారి లాంటి జిల్లాను సీఎం కేసీఆర్ సస్యశ్యామలంగా మార్చారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ ఎంతోకాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఫ్లోరైడ్ రక్కసి నుండి కాపాడారని పేర్కొన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా నల్గొండ జిల్లా గురించి చెప్పే వారిని నల్గొండ జిల్లా ప్రజలకు ఏదైనా చేయాలి అంటే అది ఫ్లోరైడ్ నివారణ ని సీఎం చెప్పేవారిని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. 20 ఏళ్ల కిందటి కెసిఆర్ ఈ సమస్య పరిష్కారానికి ఆలోచించేవారు అని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ తో కలిసొస్తున్న కమ్యూనిస్టులకు కృతజ్ఞతలు చెప్పిన జగదీశ్ రెడ్డి

టీఆర్ఎస్ తో కలిసొస్తున్న కమ్యూనిస్టులకు కృతజ్ఞతలు చెప్పిన జగదీశ్ రెడ్డి


2014 కు ముందు మునుగోడులో పరిస్థితులు ఇప్పుడు మునుగోడులో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక అంతే కాదు మునుగోడులో ఉప ఎన్నిక కోసం తమతో కలిసి వస్తానని చెప్పిన కమ్యూనిస్టులకు జగదీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో, బీజేపీతో కొట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ తో కలిసి వస్తామని చెప్పిన సిపిఎం నాయకులకు కృతజ్ఞతలు అని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ కారణంగానే నల్గొండ జిల్లా సస్యశ్యామలంగా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

English summary
Minister Jagadish Reddy made remarks in the munugode meeting that KCR greatness for removing fluoride from Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X