కేసీఆర్ రాజకీయ జీవితంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!!
మాజీ సీఎం కేసీఆర్ పైన తెలంగాణా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ స్థానంలో తాను ఉంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడిని అంటూ ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గాడి తప్పిన రాష్ట్ర బడ్జెట్ ను దారిలో పెట్టేందుకు చర్యలు చేపట్టామని, 30 ఏళ్లలో ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యుత్తమమైన బడ్జెట్ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే ప్లాన్
ఈ బడ్జెట్లో దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత దక్కిందని ఆయన స్పష్టం చేశారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ ఎందుకు స్పందించలేదు చెప్పాలని ప్రశ్నించిన ఆయన బిజెపితో బీఆర్ఎస్ విలీనం కోసం చర్చలు జరుపుతున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. కవిత కోసం, పార్టీ మనుగడ కోసం కేసీఆర్ ఆ పని చేస్తారన్నారు.

కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి
గత ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు చేసిన అప్పులకు కాంగ్రెస్ పార్టీ వడ్డీ కట్టవలసి వస్తుందని, రాష్ట్రాన్ని ఇంతగా నాశనం చేసిన కెసిఆర్ స్థానంలో తాను ఉంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడిని అంటూ పేర్కొన్నారు 100% బిజెపిలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని తేల్చి చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
బీజేపీ కుర్చీ బచావో ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించిన ఆయన కెసిఆర్ బిజెపి వైపు చూస్తున్నాడని, అందుకే కేంద్ర బడ్జెట్ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నారు. బీజేపీ కుర్చీ బచావో ప్రభుత్వమని, కుర్చీ కోసం ఏమైనా చేస్తుందని అన్నారు. అంతేకాదు నీతి ఆయోగ్ సమావేశాన్ని దక్షిణాది రాష్ట్రాలు బహిష్కరిస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ పై మూకుమ్మడి దాడి
నిన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నేతలు ఆయనపైన మాటల దాడికి దిగారు. కెసిఆర్ వల్ల రాష్ట్రం తీవ్ర కష్టాలలో ఉందని, పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అప్పులపాలు చేశారని తీవ్ర స్థాయిలో మంత్రులు నేతలు మండిపడుతున్నారు. ఇక తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెసిఆర్ స్థానంలో తాను ఉంటే రాజీనామా చేస్తానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications