Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులా కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నాడు: మంత్రి కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతుంది. మంత్రి కేటీఆర్ ప్రచార పర్వంలో విస్తృతంగా పర్యటిస్తూ రోడ్ షోలలో పాల్గొంటున్నారు. తాజాగా కామారెడ్డి లో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ అక్కడ సంచలన కామెంట్స్ చేశారు. కామారెడ్డి ఎన్నికల బరిలో సీఎం కేసీఆర్ ఉండడంతో అక్కడ ప్రచారాన్ని సాగిస్తున్న మంత్రి కేటీఆర్ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా కెసిఆర్ కామారెడ్డికి వచ్చారని వ్యాఖ్యలు చేశారు.

గత పాలనకు, కేసీఆర్ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుని, ఆచితూచి ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో కరెంట్ కష్టాలు ఏ విధంగా ఉండేవో ప్రజలు ఆలోచించాలన్నారు. గతంలో ఇంత వరి ధాన్యం పండుతుండేనా? చెప్పాలని ప్రశ్నించారు. గత రెండు సార్లు గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామని, ఇప్పుడు కూడా అభివృద్ధి కావాలంటే గులాబీ పార్టీని గెలిపించాలని కేటీఆర్ అన్నారు.

Minister KTR comments in kamareddy, says that KCR is coming to Kamareddy like a son

గతంలో ఎవరూ బీడీ కార్మికులకు పట్టించుకోలేదు అని పేర్కొన్న కేటీఆర్ దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ నే , పెన్షన్ లు ఇచ్చేది కేసీఆర్ నే అని ఆయన పేర్కొన్నారు.

మోడీ పెంచిన సిలిండర్ ధరను కెసిఆర్ తగ్గిస్తున్నాడు అని, మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కెసిఆర్ ఐదువేల రూపాయల పెన్షన్ ఇస్తారని, తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా 18ఏళ్లు నిండిన మహిళలందరికీ 3 వేల పెన్షన్ ఇస్తాం అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి 5లక్షల రూపాయల జీవిత భీమా కల్పిస్తామని తెలిపారు.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేసి మళ్ళీ పట్వారీ వ్యవస్థ తీసుకువస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. మనకు మూడు గంటల కరెంట్ కావాలా, పట్వారీ వ్యవస్థ కావాలా ఆలోచించాలన్నారు. మనకు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కామారెడ్డి వస్తే ఇక్కడి రూపురేఖలు మారుతాయన్నారు. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ ను గెలిపించాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+