ఎప్పుడూ చూడలేదు, సహించం - మంత్రి కేటీఆర్..!!
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అచ్చంపేటలో జరిగిన ఘర్షణలో గాయపడిన బాలరాజు అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాలరాజుపై దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు. రౌడీ రాజకీయాన్ని సహించమని చెప్పారు. ఓటమి ఫ్రస్టేషన్‌తో దాడులు చేస్తున్నారని విమర్శించారు. రేపు ఇదే పరిస్థితి వాళ్లకు కూడా రావొచ్చని చెప్పారు. బాలరాజుకు భద్రత పెంచాలని డిజీపీ అంజనీ కుమార్‌ను కోరుతున్నామన్నారు.
తలకు బలంగా తాకటంతో గువ్వల అపస్మారక స్థితికి వెళ్లారు. గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ రాయితో దాడిచేశారు. శనివారం రాత్రి ప్రచారం ముగించుకొని గువ్వల బాలరాజు వెళ్తుండగా, వంశీకృష్ణ తన అనుచరులతో తారసపడ్డారు. రెండు వర్గాలు పరస్పరం దూషణకు దిగాయి. ఓ వైపు కార్యకర్తలు రెచ్చగొట్టి బీఆర్‌ఎస్‌పైకి ఉసిగొల్పిన వంశీకృష్ణ, స్వయంగా రాయి తీసి విసిరి కొట్టడంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నుదుటిపై బలంగా తాకింది. దీంతో కిందపడిపోయిన ఎమ్మెల్యేను అనుచరులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

నుదుటిపై తాకటంతో వాపు వచ్చిందని, పల్స్ పడిపోయాయని వైద్యులు చెప్పారు. ప్రాథ మిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మొన్నటికి మొన్న దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ర్యాలీ సందర్భంలోనూ ఘర్షణలు జరిగాయి. తెలంగాణలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications