మంత్రి కేటీఆర్ మాస్టర్ మైండ్:ఆ రంగాల్లో హైదరాబాద్‌కు పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. మరికొన్ని నెలల్లో రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఇన్వెస్ట్‌మెంట్స్ పెద్ద ఎత్తున రానున్నాయి. దీని వెనకున్న మాస్టర్ మైండ్ మంత్రి కేటీఆర్ అని చెప్పక తప్పదు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. తాజాగా వాషింగ్టన్ డీసీలో ఎయిరోస్పేస్ డిఫెన్స్ రంగాలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి నేతృత్వం వహించారు.
ఎయిరోస్పేస్ కంపెనీలకు హైదరాబాద్ అనువైన ప్రాంతం అని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఎయిరోస్పేస్ వృద్ధి ఎలాగుందో వివరించారు. డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.గత తొమ్మిదేళ్లలో హైదరాబాద్ సిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కేరాఫ్‌గా నిలిచిందని కేటీఆర్ చెప్పారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అగ్రశ్రేణి కంపెనీలకు చెందిన ప్రతినిధులు, స్టార్టప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏరోస్పేస్ రంగంలో 2018,2020,2022 సంవత్సరాల్లో తెలంగాణకు అవార్డులు వరించాయని గర్వంగా చెప్పారు. ఎయిరోస్పేస్ రంగంలో ఎఫ్‌డీఐ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 2020-21 సంవత్సరానికిగాను హైదరాబాద్ అగ్రస్థానంలో నిలించిదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఏరోస్పేస్ రంగానికి ఎంత అనువైన ప్రాంతమో ఈ అవార్డులే చెబుతున్నాయని వెల్లడించారు.
డిఫెన్స్ రంగంలో భారత కంపెనీలను తెలంగాణ ప్రభత్వం ప్రోత్సహిస్తోందని చెప్పిన ఆయన... టీఎస్ఐపాస్‌తో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికామని అన్నారు.టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలు నెలకొల్పేవారిలో కాన్ఫిడెన్స్ నింపామని చెప్పారు.పారదర్శకతతో కూడిన విధానాలతో పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే.. ఒక పరిశ్రమకు కావాల్సిన అన్ని అనుమతులు త్వరతగతిన ఆమోదించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications