హైదరాబాద్ కంటోన్మెంట్ పై మంత్రి కేటీఆర్ సంచలనం.. నీళ్ళు, కరెంట్ కట్ చేస్తామని వార్నింగ్!!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో కేంద్రంలోని బిజెపి సర్కారు తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా కంటోన్మెంట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ అభివృద్ధిలో కేంద్రం వాటా శూన్యం
హైదరాబాద్ లో నాలాల అభివృద్ధి పై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేసీఆర్, ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు వరద సహాయం ఇంకా ఇవ్వలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రులు వచ్చి ఫోటోలు దిగి పోయారని, ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందించలేదని మండిపడ్డారు. గుజరాత్ లో వరదలు వస్తే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్లి వెయ్యి కోట్లు ఇచ్చారని పేర్కొన్న కేటీఆర్, హైదరాబాదు అభివృద్ధిలో కేంద్రం వాటా శూన్యం అంటూ మండిపడ్డారు.

కంటోన్మెంట్ అధికారుల తీరుపై కేటీఆర్ ఫైర్
అంతేకాదు తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కంటోన్మెంట్ ఏరియాలో ఇష్టమొచ్చినట్టుగా రోడ్లు మూసివేస్తే ఊరుకోమని కేటీఆర్ తేల్చిచెప్పారు. ప్రజల కోసం తాము ఎంత దూరమైనా వెళ్తామని కేటీఆర్ హెచ్చరించారు. కంటోన్మెంట్ ఏరియాలో నాలాలపై చెక్ డ్యాములు కట్టడంవల్ల కాలనీలు మునిగిపోతున్నాయి అని, ఎన్నిసార్లు చెప్పినా అక్కడ అధికారుల తీరు మార్చుకోవడం లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

ఇష్టం వచ్చినట్టు చేస్తే కంటోన్మెంట్ కు నీళ్ళు, కరెంట్ కట్ చేస్తాం
ప్రజల కోసం తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే కంటోన్మెంట్ కు నీళ్లు, కరెంటు కట్ చేస్తామని మంత్రి కేటీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులతో ఆఖరుసారి చర్చలు జరపాలని వినకపోతే నీళ్లు, కరెంటు కట్ చేయాలని అసెంబ్లీలోనే ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ కి మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ లో భాగంగా ఉన్న కంటోన్మెంట్ హైదరాబాద్ లో కలిసి మెలిసి ఉండాలని, ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకోబోమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక మార్లు కంటోన్మెంట్ వ్యవహారంపై మాట్లాడిన కేటీఆర్ ఇంత తీవ్రంగా వార్నింగ్ ఇవ్వడం కంటోన్మెంట్ ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరగబోతుంది అన్న ఆసక్తి రేపుతుంది.తెలంగాణ వేరే దేశమైనట్టు కేంద్రం వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Recommended Video

హైదరాబాద్ లో వరదనీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కోసం ఎస్ఎన్డీపీ కార్యక్రమం
ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో వరదనీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కోసం ఎస్ఎన్డీపీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. దీనికింద 985. 45కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం అరవై పనులు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. ఈ పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎస్ఎన్డీపీ పనులలోనూ కేంద్రం వాటా లేదని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. జిహెచ్ఎంసి ఏరియాలో 735 కోట్ల రూపాయలతో, 250 కోట్ల రూపాయలతో జిహెచ్ఎంసి వెలుపల చేపట్టిన పనులను ప్రతివారం తానే సమీక్షిస్తున్నా అని మంత్రి వెల్లడించారు. 11 వేల కోట్లతో హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ చేసినట్లుగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications