మునుగోడులో బీజేపీ చెప్పిందే చేసిన మంత్రి మల్లారెడ్డి.. మందుపార్టీ ఫోటోలు వైరల్!!

మునుగోడులో ఉప ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. తాగినోడికి తాగినంత, తిన్నోడికి తిన్నంత అన్న చందంగా విందు, మందు రాజకీయం కనిపిస్తుంది. ఇక తాజాగా ఎప్పుడు వివాదాల్లోకి వెళ్లే మంత్రి మల్లారెడ్డి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా మందు బాటిల్ పట్టుకొని విందులో పాల్గొని కాంట్రవర్సీకి కారణమయ్యారు.

మునుగోడులో దూకుడుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు

మునుగోడులో దూకుడుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు

మునుగోడు ఉప ఎన్నికల సమయం దగ్గర పడటంతో అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా మునుగోడును హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ నుండి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగగా, బిజెపి తన ముఖ్య నేతలను రంగంలోకి దింపి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులను మునుగోడుకు పంపించి ప్రచారాన్ని సాగిస్తోంది.

మందు బాటిల్ తో సహచరులకు లిక్కర్ పోస్తున్న మంత్రి మల్లారెడ్డి ఫోటోలు వైరల్

మందు బాటిల్ తో సహచరులకు లిక్కర్ పోస్తున్న మంత్రి మల్లారెడ్డి ఫోటోలు వైరల్


ఇదిలా ఉంటే మునుగోడు కు వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తాగి తందనాలు ఆడడానికి వస్తున్నారని ఇప్పటికే బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక అందుకు ఊతమిచ్చినట్టుగా మునుగోడు లో ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి మందు బాటిల్ పట్టుకొని ఓ విందులో పాల్గొంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి మల్లారెడ్డి ఫుల్ లిక్కర్ బాటిల్ పట్టుకొని తనతో కలిసి కూర్చున్న వారందరికీ మందు పోస్తున్న ఫోటో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టింది.

 మందు, విందులతో ప్రలోభాలు మొదలుపెట్టిన మల్లారెడ్డి.. ప్రతిపక్షాల ఆరోపణలు

మందు, విందులతో ప్రలోభాలు మొదలుపెట్టిన మల్లారెడ్డి.. ప్రతిపక్షాల ఆరోపణలు

మునుగోడు ఉప ఎన్నికకు చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామం ఇన్చార్జిగా మంత్రి మల్లారెడ్డి నియమితులయ్యారు. అయితే అందరిలా కాకుండా మల్లారెడ్డి, ఓటర్లను ఆకట్టుకోవడానికి తనదైన శైలిలో పని మొదలుపెట్టారు. ఇప్పటికే మందు, విందులతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపణలు వస్తున్న వేళ చౌటుప్పల్ సమీపంలోని ఒక హోటల్ ను బుక్ చేసుకుని గత కొద్ది రోజులుగా మంత్రి మల్లారెడ్డి తాగినోడికి తాగినంత మందు పోస్తున్నారని వార్తలు వెల్లువగా మారాయి.

హోటల్ లో ఫుల్ బాటిల్ ఎత్తిన మల్లారెడ్డి .. సర్వత్రా విమర్శలు

హోటల్ లో ఫుల్ బాటిల్ ఎత్తిన మల్లారెడ్డి .. సర్వత్రా విమర్శలు

ఈ క్రమంలో తాజాగా మంత్రి మల్లారెడ్డి ఆదివారం ప్రచారం ముగించుకుని తమ పార్టీ నాయకులతో కలిసి హోటల్ కు వెళ్లి, అక్కడ వారికి మందు పోస్తూ విందులో పాల్గొన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మంత్రి హోదాలో ఉన్న మల్లారెడ్డి స్వయంగా లిక్కర్ పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లను బాహాటంగా ప్రలోభ పెడుతున్నా టిఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవడం లేదని, అధికారులు కూడా టీఆర్ఎస్ పార్టీకి వత్తాసుగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మంత్రి మల్లారెడ్డి మందు పోస్తున్న ఫోటోలపై బీజేపీ ఫైర్

మంత్రి మల్లారెడ్డి మందు పోస్తున్న ఫోటోలపై బీజేపీ ఫైర్

ఇక బిజెపి నాయకులు, మునుగోడు ఉప ఎన్నికల్లో తాము చెప్పిందే నిజమని, మందు, విందులతో పాటు, వేల రూపాయల డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఖచ్చితంగా ఈసీ దృష్టిసారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇక తాజాగా వైరల్ అవుతున్న మంత్రి మల్లారెడ్డి ఫోటోలపై గులాబీ నేతలు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+