ప్రభుత్వం అంటే లెక్కలేదా?, బ్యాంకర్లు తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి హరీశ్ (ఫోటోలు)

హైదరాబాద్: తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేసే విషయంలో బ్యాంకర్లు నిబంధనలను పాటించకుండా రైతులను మోసం చేస్తున్నాయని మంత్రులు హరీష్ రావు, పోచారం విమర్శించారు. ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. నాలుగు విడుతలుగా 25శాతం చొప్పున మాఫీ మొత్తాన్ని బ్యాంకులకు అందిస్తామని, రైతుల నుంచి ఎలాంటి వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వం 323 జీవో విడుదల చేసింది.

జీవోను పట్టించుకోకుండా బ్యాంకర్లు మాత్రం రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారు. క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయాలను, ఎస్‌ఎల్‌బీసీ(స్టేట్‌లెవల్ బ్యాంకర్స్ కమిటీ) నివేదికను, ప్రభుత్వ జీవోలను పట్టించుకోరా? బ్యాంకులు కూడా ప్రభుత్వంలో భాగమేనని బ్యాంక ర్లు గుర్తుపెట్టుకుంటే మంచిది అని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

రైతుల నుంచి వసూలు చేసిన వడ్డీ మొత్తాన్ని వారంలోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ప్రభుత్వ సూచనలు పట్టించుకోకుంటే, బ్యాంకర్లకు సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. రైతుల పట్ల బ్యాంకర్లు సానుకూలంగా వ్యవహరించాలని, ఇప్పటికే పంటల బీమా విషయంలో తీవ్రంగా నష్టపోతున్న వీరిని ఆదుకోవాల్సి వుందని హరీశ్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం అంటే లెక్కలేదా?, బ్యాంకర్లు తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి హరీశ్

ప్రభుత్వం అంటే లెక్కలేదా?, బ్యాంకర్లు తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి హరీశ్

మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రులు పోచారం, హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు రుణమాఫీ, పం టరుణాల అందించడంలో జాప్యంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మాటకు కట్టుబడి ప్రభుత్వం 36.33 లక్షల మంది రైతులకు చెందిన రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, ఇప్పటికే రెండు విడతలుగా 50 శాతం డబ్బులను బ్యాంకులకు విడుదల చేశామన్నారు.

 ప్రభుత్వం అంటే లెక్కలేదా?, బ్యాంకర్లు తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి హరీశ్

ప్రభుత్వం అంటే లెక్కలేదా?, బ్యాంకర్లు తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి హరీశ్

రైతుల పరిస్థితికి చలించి ప్రభుత్వం రుణమాఫీ చేస్తే, బ్యాంకర్లు మాత్రం మాఫీ వర్తింపు, తిరిగి రెన్యూవల్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 4,970 బ్యాంకులుండగా 50 శాతం బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీ వసూలు చేయడంతోపాటు కొత్త రుణాలు ఇవ్వ డం లేదని, రెన్యూవల్ చేయకుండా తిప్పలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

 ప్రభుత్వం అంటే లెక్కలేదా?, బ్యాంకర్లు తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి హరీశ్

ప్రభుత్వం అంటే లెక్కలేదా?, బ్యాంకర్లు తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి హరీశ్

రైతు నుంచి వడ్డీ వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలున్నా బ్యాంకర్లు ఎందుకు పక్కనబెడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే లెక్కలేదా? ఇంత బరితెగింపు ఎందుకు? ఇదేనా మీ తీరు? అని నిలదీశారు. ప్రతి రైతులకు రుణమాఫీ వర్తింపచేయాలని, మాఫీ వచ్చినట్లుగా ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్లు అందించాలని ఆదేశించారు.

ప్రభుత్వం అంటే లెక్కలేదా?, బ్యాంకర్లు తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి హరీశ్

ప్రభుత్వం అంటే లెక్కలేదా?, బ్యాంకర్లు తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి హరీశ్

ఆదేశాలను పట్టించుకోని పక్షంలో బ్యాంకులకు సహాయనిరాకరణ తప్పదని హెచ్చరించారు. బర్రెలు, మేక లు, గొర్రెలు పెంపకానికి, మైక్రో ఇరిగేషన్‌కు రైతులకు బ్యాం కులు రుణాలు ఇవ్వాలని సూచించారు. రైతుల జీవితాలతో బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఆడుకుంటున్నాయని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

 ప్రభుత్వం అంటే లెక్కలేదా?, బ్యాంకర్లు తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి హరీశ్

ప్రభుత్వం అంటే లెక్కలేదా?, బ్యాంకర్లు తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి హరీశ్

రూ.లక్ష రుణం తీసుకున్న రైతు నుంచి పత్తికి రూ.13 వేల ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారని, పంట నష్టపోయినా ఇన్సూరెన్స్ చెల్లించడంలేదని మండిపడ్డారు. మెదక్ జిల్లా నుంచి ఏటా రూ.90 కోట్లు రైతులు పంటలకు ఇన్సూరెన్స్ చెల్లిస్తూ మోసపోతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+