తెలంగాణ రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్..!!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్దం చేసిన భూ భారతి ప్రాజెక్టు ను తొలుత పైలెట్ ప్రాజెక్టుగా అమలుకు నిర్ణయించింది. రేపు (గురువారం) ఈ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించనుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత అమలు తరువాత.. రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి వివరించారు.

తెలంగాణలో భూ భారతి చట్టం ఏప్రిల్ 17 నుంచి పైలట్ ప్రాజెక్ట్‌ ద్వారా అమల్లోకి రానుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ చట్టాన్ని ప్రారంభించనున్నారు. ఈ చట్టం ద్వారా రానున్న రోజుల్లో అనేక భూ సమస్యలకు పరిష్కారం లభించనుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూ భారతి చట్టం, భూ ముల సమస్యలను పరిష్కారానికి ఒక మంచి అవకాశమని మంత్రి తెలిపారు. ఈ చట్టం ద్వారా, భూముల సంబంధిత వివాదాలను త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ చట్టం ప్రకారం, రాష్ట్రంలోని పలు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుల ద్వారా, ప్రజలకు భూ భారతి చట్టం గురించి అవగాహన కల్పిస్తారని చెప్పారు.

minister-ponguleti-key-announcement-on-bhu-bharati-pilot-project

నారాయణ్‌పేట జిల్లా మద్దూర్ మండలంలోని కాజాపురం గ్రామంలో ఈ ప్రాజెక్ట్‌ను మంత్రి శ్రీనివాస రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ చట్టాన్ని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భూముల సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించబడతాయి. ఈ సదస్సులలో, ప్రజలు తమ భూములపై ఉన్న సమస్యలను, వివాదాలను ప్రభుత్వ అధికారులకు తెలియజేయవచ్చు. ఈ విధంగా, ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పడుతుంది. వారి సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందిని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+