మునుగోడుకు పరుగులు పెడుతున్న మంత్రులు; కేసీఆర్ కొత్త వ్యూహంలో ఫోకస్ దానిపైనే!!
మునుగోడు ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ రూపొందించిన విషయం తెలిసిందే. మునుగోడులో వందమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను, కార్పొరేషన్ చైర్మన్ లను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

మునుగోడులో అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రులు
మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోపు మంత్రులు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ చేసిన ఆదేశాలతో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మునుగోడులో ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి చేప పిల్లల పంపిణీ చేశారు. అంతేకాదు మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌లో గణనీయమైన జనాభా ఉన్న వెనుకబడిన తరగతుల ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చే వారం కురుమ, యాదవ వర్గాలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఉప ఎన్నిక వరకు రవాణా, ఆరోగ్యం, విద్య, రోడ్లు, భవనాల శాఖల మంత్రులతో కూడిన కార్యక్రమాలను ప్లాన్ చేశారు.

మంత్రి తలసాని గొర్రెల యూనిట్ల పంపిణీ
రెండో దశ గొర్రెల పంపిణీ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 వేల దరఖాస్తులు రాగా, ఒక్క మునుగోడు నుంచే దాదాపు 5,500 వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాతిపదికన ముందుగా మునుగోడుకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సెప్టెంబరు 16 నుంచి 18 వరకు అన్ని జిల్లాల్లో తెలంగాణ సమైక్యాంధ్ర దినోత్సవ వేడుకలు ముగిశాక మునుగోడులో మరింత విస్తృతంగా పర్యటించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారని పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుని సమన్వయంతో పని చేయాలని కెసిఆర్ ఆదేశించారు.

కొత్తగా నిర్మించిన ఆస్పత్రిని ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించడం వంటి రాజకీయ కారణాలతో దాదాపు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొత్తగా నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు పర్యటించనున్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలోనే కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి కూడా హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. మునుగోడులో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నం చెయ్యనున్నారు.

రోడ్ల నిర్మాణాలపై ఫోకస్.. మంత్రులు వేముల, ఎర్రబెల్లి , పువ్వాడ పర్యటనలు
నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో రోడ్ల పనులను ప్రారంభించేందుకు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించనున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా నియోజకవర్గాల్లో పర్యటించి బస్టాండ్లు, పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు వంటి ఆయా శాఖల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక పై దూకుడు పెంచుతున్న టీఆర్ఎస్
మునుగోడు ఉపఎన్నికపై, భారత ఎన్నికల సంఘం ఉపఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో కొందరు మంత్రులు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ వెలువడి అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో పోలింగ్ నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ దూకుడును పెంచుతున్నట్లుగా తెలుస్తుంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications