మైనర్ బాలిక మృతి, అత్యాచారం చేసి చంపారా,ప్రమాదమా..?

పటాన్ చెరువు మండలంలోని క్యాసారం గ్రామంలో ఓ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణిచింది. తమ కూతురుపై అత్యాచారం చేసి హత్య చేశారని భాదిత కుటుంబసభ్యులు ప్రసాద్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంగారెడ్డి :సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలో మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ బాలిక మరణానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. అత్యాచారానికి గురై బాలిక చనిపోయిందా., ప్రమాదవశాత్తు చనిపోయిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో బాలిక కుటుంబంలో విషాదం నెలకొంది.

పటాన్ చెరువు మండలంలోని క్యాసారం గ్రామంలో ఓడిఎప్ ఉద్యోగి శరణఫ్ఫ ఇంట్లో శుభకార్యం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే శరణప్ప కూతురకు మెహిందీ పెట్టేందుకు అదే గ్రామానికి చెందిన ఆప్రీన్ బేగం వెళ్ళింది. శరణప్ప కుమార్తెకు ఆమె మెహిందీ పెట్టింది.

 minor girl death mystery in sangareddy district

మెహిందీ పెట్టిన తర్వాత ఆప్రీన్ బేగం ఆమె ఇంటి వద్ద దించేందుకు శరణప్ప మన్నె శ్రీనివాస్ కు బైక్ ఇచ్చి పంపాడు. క్యాసారం నుండి బిడిఎల్ దారిలో ఆప్రీన్ బేగం అనుమానాస్పదస్థితిలో మరణించింది. ఈ ఘటనకు కారణాలు ఏమిటనే విషయమై ఆరా తీస్తున్నారు పోలీసులు.

బైక్ పై తీసుకెళ్తుండగా ఆప్రీన్ బేగం కింద పడిందని, ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించిందని ప్రసాద్ చెబుతున్నాడు. అయితే ప్రసాద్ గతంలో ఓ బాలికపై కూడ అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆయనపై కేసు నమోదైంది.తమ కూతురిపై అత్యాచారం చేసి ప్రసాద్ చంపాడని భాదితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+