ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రైతుల కన్నెర్ర.. కాంటాలు ధ్వంసం; గిట్టుబాటు ధరకు డిమాండ్
మిర్చి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని మిర్చి రైతులు కన్నెర్ర చేశారు. ఎనుమాముల మార్కెట్ వద్ద మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. గిట్టుబాటు ధర కల్పించాలని వారు మార్కెట్ యార్డ్ వద్ద ధర్నాకు దిగారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని గిట్టుబాటు ధర కోసం రైతులు ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.

గిట్టుబాటు ధర కోసం మిర్చి రైతుల ఆందోళన
తేజ మిర్చి పంటకు 17, 200 రూపాయల ధర పలికిన ప్పటికీ ఎనుమాముల మార్కెట్లో 9 వేల నుంచి 13 వరకు మాత్రమే మిర్చి పంటను దళారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ మార్కెట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వ్యాపారులతో అధికారులు చర్చలు జరిపారు. మిర్చి నాణ్యత చూసి మరోసారి ధరలను పునఃసమీక్షించాలని, ధరలను సవరించాలని వ్యాపారులకు అధికారులు సూచించారు.

రైతులతో చర్చలు జరుగుతుండగానే, వ్యాపారుల కాంటాలు.. భగ్గుమన్న రైతన్నలు
ఈ విషయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రైతులను అనునయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు ఏమాత్రం వినిపించుకోలేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బయట తేజ మిర్చి పంట ధర 17 వేలకు పైగా ఉందని, తమకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్ణయించిన ధరకు రెండు వేల రూపాయలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రైతులతో చర్చలు జరుగుతుండగానే, మరోవైపు వ్యాపారులు కాంటాలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.

కాంటాలను ఎత్తిపడేసి... డీసీఎం వాహన అద్దాలను ధ్వంసం చేసిన రైతులు
కాంటాల నిర్వహణను అడ్డుకున్నారు. తూకం పూర్తయిన బస్తాలను ట్రాక్టర్ల పై నుండి కింద పడేశారు. మార్కెట్‌లో వాహనాలలో లోడ్ చేసిన మిర్చి బస్తాలను ఎత్తిపడేసి మిర్చిని వెదజల్లారు. ఈ క్రమంలో కాంటాలతో పాటుగా, డీసీఎం వాహనాల అద్దాలను సైతం రైతులు ధ్వంసం చేశారు. రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోగా పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Recommended Video

మిర్చి పంటకు తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గింది .. కానీ గిట్టుబాటు లేదని రైతుల ఆవేదన
మిర్చి రైతులు ఇప్పటికే ఆరుగాలం పండించిన పంట చేతికి రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈసారి అకాల వర్షాలు, మిర్చి పంటకు తెగుళ్ల కారణంగా దిగుబడి చాలా తక్కువ వచ్చిందని, ఈ సమయంలో కూడా గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మిర్చి రైతులు వాపోతున్నారు. కనీస మద్దతు ధర చెల్లించకుండా దళారులు దోచుకోవడానికి అడ్డుకోవాలని, ప్రభుత్వం దళారీ దోపిడి వ్యవస్థకు చెక్ పెట్టి, గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications