నాగార్జున సాగర్‌కు ప్రపంచ సుందరీమణులు.. ఎప్పుడంటే ?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ - 2025 పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తోంది. ఇప్పటికే అట్టహాసంగా ప్రారంభమైన 72వ ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో 110కి పైగా దేశాల నుంచి సుందరీమణులు విశ్వసుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా పోటీలో ఉన్నారు. ఇక అందాల భామలు బృందాలుగా ఏర్పడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించనున్నారు.
ఈ క్రమంలోనే రేపు ( మే 12, 2025 ) నాగార్జునసాగర్ లోని బుద్ధ వనాన్ని సందర్శించనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో ఆసియా దేశాలకు చెందిన 30 మంది మిస్ వరల్డ్ పోటీదారులు నాగార్జున సాగర్ లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకుంటారు. ఆ తర్వాత మీడియా కోసం గ్రూప్ ఫొటోలు దిగనున్నారు. ఇక విజయ్ విహార్ నుంచి బుద్ధ వనానికి చేరుకుంటారు.

బుద్ద పూర్ణిమ కావడంతో బుద్ధుడికి పుష్పాంజలి ఘటిస్తారు. మహాస్థూపంపై ఉన్న విగ్రహాల గురించి వారికి ప్రముఖ బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగి రెడ్డి వారికి వివరిస్తారు. చివరగా మహాస్థూపం లోపల ధ్యానం చేసి ఐదు నిమిషాల పాటు మాంగ్స్ చాటింగ్‌లో పాల్గొంటారు. మహా స్తూపం నుంచి జాతక పార్కును సందర్శించి బుద్ధుడి చరిత్ర, తెలంగాణ బుద్ధిజం, బౌద్ధ విశేషాలు తెలుసుకుంటారు. అక్కడే బుద్ధ చరితపై డ్రామా కూడా ప్రదర్శించనున్నారు. బుద్ద వనంలో డిన్నర్‌లో పాల్గొని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.
దీంతో అందాల భామలు స్టే చేయనున్న విజయ విహార్, బుద్ధ వనం, మహా స్తూపానికి విద్యుత్ దీపాలతో అధికారులు అలంకరించారు. పోటీదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
With great pride, on behalf people of #Telangana, I declared the 72nd #MissWorld Competition open in #Hyderabad. It is very apt that India's global city is hosting a truly global event.
— Revanth Reddy (@revanth_anumula) May 10, 2025
I welcome the participants from different parts of the world, representing all continents.… pic.twitter.com/nDXjtp2oix
మరోవైపు ఈ నెల 15న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రాన్ని, భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. పోచంపల్లి పట్టు వస్త్రాలకు వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. వారి పర్యటన కోసం అధికారులు రూరల్ టూరిజం పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోచంపల్లికి సాయంత్రం వచ్చే అందాల భామలకు టూరిజం ప్రధాన ద్వారం నుంచి లోపలి మ్యూజియం వరకు మహిళలు కోలాటాలతో స్వాగతం పలుకుతారని సమాచారం.
అలానే అదే రోజున యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని 10 మంది సుందరీమణులు దర్శించుకొనున్నారు. 15వ తేదీ సాయంత్రం ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications