ఉచిత చికిత్స, భోజన వసతి: బసవతారకంలో బాలయ్య (ఫోటోలు)
హైదరాబాద్: జన్యు లోపంతో పుట్టుకతోనే ఏర్పడే గ్రహణం మొర్రి, పెదవి చీలిక(క్లెఫ్ట్ లిప్ అండ్ పాలెట్)తో బాధపడే చిన్నారులకు బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బీఐఏసీహెచ్ అండ్ అర్‌ఐ)లో ఉచితంగా చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వ్యవస్థాపక చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఈ మేరకు బుధవారం ఆయన క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. జన్యుపరంగా వచ్చే క్లెఫ్ట్ జబ్బుతో బాధపడే చిన్నారులకు బసవతారకం స్మైల్ ట్రైన్ సెంటర్(బీఎస్‌టీసీ) ద్వారా ఎంతో కాలంగా ఉచిత చికిత్స అందిస్తున్నామన్నారు.

ఉచిత చికిత్స, భోజన వసతి: బసవతారకం ఆస్పత్రిలో బాలయ్య
భావి భారత పౌరులు పడుతున్న బాధలను దూరం చేసే దిశగా బసవతారకం స్మైల్ ట్రైన్ సెంటర్(బీఎస్‌టీసీ) కృషి చేస్తోందని వెల్లడించారు. బీఎస్‌టీసీలో వైద్యచికిత్స చేయించుకునే ఆడపిల్లలకు ప్రతీఒక్కరికీ రూ.5వేల ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తామని ప్రకటించారు.

ఉచిత చికిత్స, భోజన వసతి: బసవతారకం ఆస్పత్రిలో బాలయ్య
ఉచిత శస్త్రచికిత్సకు వచ్చే వారికి భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఆసుపత్రిలో ఇప్పటి వరకు శస్త్రచికిత్స చేసుకున్న వారికి బుధవారం అవగాహన కల్పించడంతో పాటు ఆత్మస్థైర్యాన్ని నూరిపోశారు. చికిత్స పొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు.

ఉచిత చికిత్స, భోజన వసతి: బసవతారకం ఆస్పత్రిలో బాలయ్య
గ్రహణం మొర్రి శస్త్రచికిత్స నిపుణుడు డి.ముకుందరెడ్డి మాట్లాడుతూ ఈ సమస్యకు సర్జరీ ద్వారానే పరిష్కారం లభిస్తుందన్నారు. ఆరు నుంచి ఏడాది వయసులోపు ఉన్న చిన్నారుల్లో సర్జరీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

ఉచిత చికిత్స, భోజన వసతి: బసవతారకం ఆస్పత్రిలో బాలయ్య
ఈ వ్యాధిపై గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు ఉన్నాయని, వాటిని దూరం చేసి శస్త్రచికిత్స చేయించుకునేలా అవగాహన కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న వలంటీర్లను బాలకృష్ణ సత్కరించారు.












Click it and Unblock the Notifications