విజయారెడ్డి హత్య ప్లాష్‌బ్యాక్... ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి భూకబ్జాదారుడు.. నయీంతో సంబంధాలు

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం రెండు రాజకీయా పార్టీ నేతల మధ్య దుమారం రేపుతోంది. ఆమె హత్యకు కారణము నువ్వంటే నువ్వని ఇబ్రహింపట్నం మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో తహాసీల్దార్ సజీవదహానానికి రాజీకీయా కారణాలు కూడ ఒకటని ఇరువురి వాదలనతో స్పష్టంగా తెలుస్తోంది.

రాజీకీయా దుమారం రేపుతున్న విజయారెడ్డి హత్య

రాజీకీయా దుమారం రేపుతున్న విజయారెడ్డి హత్య

తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం కీలక మలుపు తిరుగుతోంది. ఎప్పటి నుండో ఉన్న భూముల వివాదం స్థానిక రాజకీయా నాయకుల అంతర్గత ఘర్షణ విజయారెడ్డి ప్రాణాన్ని బలితీసుకున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. విజయారెడ్డి హత్యతో అందుకు కారణం అధికార పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంటూ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆమె అంతిమ సంస్కారాలు జరుగుతున్న సంధర్భంలో ఆరోపణలు చేశారు. దాడికి పాల్పడిన సురేశ్ అధికార పార్టీ కార్యకర్త అంటూ ధ్వజమెత్తారు.

మల్‌రెడ్డిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే

మల్‌రెడ్డిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే

అయితే మల్‌రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మొత్తం భూములపై విచారణ జరిపించాలని సురేశ్ కుటుంబానికి చెందిన ఆస్తులు మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కుటుంబసభ్యులు కొనుగోలు చేశారని వివరించారు. ఆయన లాండ్ గ్రాబింగ్ చేసి వందల కోట్ల రుపాయాలు సంపాదించాడని తీవ్రంగా మండిపడ్డారు. రెండు ఎకరాలు ఉన్న రంగారెడ్డి వందల కోట్ల రుపాయాల ఆస్తులు అక్రమంగా సంపాదించాడని అన్నారు. గౌరారంలోని వివాదంలో ఉన్న మొత్తం నాలుగు వందల ఎకరాలపై విచారణ జరపాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు ఆయన వివరించారు.

 10 ఏళ్లుగా ఎమ్మెల్యే భూదందాలు

10 ఏళ్లుగా ఎమ్మెల్యే భూదందాలు

అయితే మంచిరెడ్డి వ్యాఖ్యలను మరోసారి మల్‌రెడ్డి ఖండించారు. తనకు ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే పేదలకు పంచుతానని చెప్పారు. తహిసీల్దార్ పై దాడి చేసిన సురేశ్ టీఆర్ఎస్ కార్యకర్త అంటూ చెప్పారు. కిషన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు వందల కోట్ల రుపాయాల ఆస్తులను కొల్లగొట్టారని ఆరోపణలు చేశారు. గత పదిసంవత్సరాలుగా అనేక దోపిడిలకు పాల్పడ్డారని అన్నారు. నయింతో కలిసి ఆయన భూదందాలు చేశారని అరోపణలు చేశారు. కిషన్ రెడ్డి చేసిన మోసాలను సాక్ష్యాలతో సహా దర్యాప్తు సంస్థలకు ఇస్తానని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేను సస్పెండ్ చేసి సిబిఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+