కేసీఆర్‌కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా? జాగ్రత్త: షర్మిలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్
వైఎస్ షర్మిల కేసీఆర్ కు తాను బూట్లు కొని పంపిస్తున్నానని, తనతో పాటు ఒక్క రోజైనా పాదయాత్ర చెయ్యాలని చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. షర్మిలకు వార్నింగ్ ఇచ్చారు.
వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ కు బూట్లు కొని తనతో పాటు పాదయాత్ర చేయాలని చేసిన వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైయస్ షర్మిల ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

షర్మిలను టార్గెట్ చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి
వైయస్ షర్మిల చెప్పుల దుకాణం యజమాని లాగా మాట్లాడుతుందని, కెసిఆర్ కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా అంటూ పెద్ద సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు, ముఖ్యమంత్రి గారు మీతో పాదయాత్ర చేస్తారా? కాస్త నోటి దురుసు తగ్గించుకో అంటూ వైయస్ షర్మిలకు హితవు పలికారు. తాను పులివెందులకు వస్తానని.. అక్కడ మీ అన్న వైయస్ జగన్ ముఖ్యమంత్రి కదా.. మరి మీ అన్న నాతో వస్తాడా అంటూ సవాల్ విసిరారు. మీ నాన్న రాజశేఖర్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడని, ఎప్పుడూ నీలా చిల్లర మాటలు మాట్లాడలేదని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే జరిగేదదే.. పెద్ది హెచ్చరిక
గతంలో వైఎస్ షర్మిల పాదయాత్ర ఆగిపోవడానికి షర్మిలనే బాధ్యురాలు అని పేర్కొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి, షర్మిల పాదయాత్ర పై బీఆర్ఎస్ కు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. తాము కోర్టు తీర్పును గౌరవిస్తామని పాదయాత్ర చేసుకోవచ్చని పేర్కొన్న ఆయన, నిరాధారమైన, అసత్యమైన, వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు . ప్రజా సమస్యల పైన ఎవరైనా మాట్లాడొచ్చని, కెసిఆర్ పైన, వారి కుటుంబ సభ్యుల పైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే షర్మిల పాదయాత్రను తప్పకుండా అడ్డుకొని తీరుతామని పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.

ఆ పని చేస్తే నిరసన తప్పదన్న పెద్ది సుదర్శన్ రెడ్డి
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా ప్రజా సమస్యలపై మాట్లాడవచ్చు అని పేర్కొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి, పాదయాత్రలు కూడా చేయవచ్చునన్నారు. కానీ రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ ఆస్థిత్వాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని, ఉద్యమకారులను అవమానించే విధంగా మాట్లాడితే ప్రజాక్షేత్రంలో మీకు నిరసన తప్పదని స్పష్టం చేశారు. పాదయాత్ర చేసే సమయంలో నోటికి వచ్చింది మాట్లాడకుండా, ఒక బాధ్యతాయుతమైన పార్టీలా పాదయాత్ర చేసుకోవాలని పెద్ది సుదర్శన్ రెడ్డి సూచించారు.
కేసీఆర్ కు బూట్లు పంపించిన వైఎస్ షర్మిల వ్యాఖ్యల కలకలం
వైయస్ షర్మిల పాదయాత్రకు వెళ్లే ముందు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ తమతో కలిసి పాదయాత్రకి రావడానికి బూట్లు పంపిస్తున్నామని, కనీసం ఒక్కరోజైనా తనతో పాటు నడవాలని, ప్రజల సమస్యలు ఒక రోజైన ప్రజాక్షేత్రంలోకి అన్నారు వచ్చి చూడాలన్నారు. బూట్లు సైజు సరిపోకుంటే, బిల్లు కూడా పంపిస్తున్నాను మార్చుకోవచ్చు అన్నారు.
పిట్టలదొరలాగా ప్రైవేట్ విమానాల్లో టోపీ పెట్టుకుని తిరగడం కాదని, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల మధ్యలోకి వెళ్లి తిరగాలని వైయస్ షర్మిల సూచించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజాదర్బార్ ఎంతో వైభవంగా జరిగేదని పేర్కొన్న వైఎస్ షర్మిల సామాన్యులు కూడా ముఖ్యమంత్రిని కలిసే వారన్నారు. ఇప్పుడు ఉద్యమకారులకు కూడా కెసిఆర్ కలవడం లేదని షర్మిల ఎద్దేవా చేశారు. ఇక వైఎస్ షర్మిల వ్యాఖ్యలను పెద్ది సుదర్శన్ రెడ్డి టార్గెట్ చేశారు. రివర్స్ ఎటాక్ చేశారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications