అసెంబ్లీకి తిరిగి రాకుండా, సొంత వారే చేస్తున్నారు - రాజాసింగ్ ఎమోషనల్..!!

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదని, తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందన్నారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు సభలోనే రాజాసింగ్ ఒక అభ్యర్ధన చేసారు. రాజాసింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రాజాసింగ్ వ్యాఖ్యల వెనుక : అసెంబ్లీ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదని రాజాసింగ్ పేర్కొన్నారు. తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

MLA Raja Singh

తన సొంత వారు, బయటి వారు తనను రాకుండా చేయాలని చూస్తున్నారని సంచలనానికి తెర తీసారు. ముఖ్యమంత్రి ఒక విన్నపం. తాను ఉన్నా లేకున్నా తన గోషామహల్ నియోజకవర్గ ప్రజలపై దయ చూపాలని ముఖ్యమంత్రి ని కోరారు. రాజాసింగ్ ఈ వ్యాఖ్యల సమయంలో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.

సీఎం కేసీఆర్ కు వినతి : ప్రభుత్వం గోషామహల్ నియోజకవర్గాన్ని విస్మరించడం బాధాకరంగా ఉందని రాజాసింగ్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గానికి తాను ఎంతో చేశానని చెప్పారు. నియోజకవర్గ సమస్యలు, తన పరిధిలో లేని పనులు, ప్రభుత్వం చేయాల్సిన పనుల కోసం తాను ఎన్నికైన నాటి నుంచి అనేక వేదికల మీద, అన్ని అసెంబ్లీ సమావేశాల్లో వివరించానని ప్రస్తావించారు.

కాగా ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. నాటి నుంచి ఆయన బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతకాలం గడిచాక సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావించినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి సంకేతాలు రాలేదు.

ఇక పోటీకి దూరమేనా : ఈమధ్య బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావుతో రాజాసింగ్ భేటీ అవ్వడం కొత్త ఊహాగానాలకు దారితీసింది. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని రాజాసింగ్ కొట్టిపారేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీజేపీ దివంగత మంత్రి కుమారుడి వైపు చూస్తుందనే ప్రచారం సాగుతోంది. రాజాసింగ్ సస్పెన్షన్ విషయంలో తెలంగాణ పార్టీ నేతలు హైకమాండ్ తో మాట్లాడుతామని హామీ ఇచ్చినా, ఫలితం కనిపించ లేదు. ఇక, ఇప్పుడు రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరనే విధంగా తాజా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+