జాగ్రత్తగా మాట్లాడన్న ఈటల...! ఏం కాదులే అన్నా...: రసమయి

రెండు రోజుల క్రితం మంత్రి ఈటల రాజేందర్ గులాబి జెండాకు తాము కూడ ఓనర్లం అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం స‌ృష్టించిన విషయం తెలిసిందే.. నేడు టీచర్స్ డే సంధర్భంగా మరో కరీంనగర్ ఎమ్మెల్యే కూడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పక్కనే ఈటేల రాజేందర్ కాస్త జాగ్రత్తగా మాట్లాడు అంటూ సైగ చేసిని పరిస్థతి అయినా ఏమీ కాదన్న అంటూ రసమయి బాలక్రిష్ణ ప్రసంగాన్ని కొనసాగించారు.

సమావేశంలో భాగంగానే మంత్రి ఈటల రాజేందర్‌కు తనకు నిజాలు మాట్లాడడమే తెలుసని రసమయి బాలకిషన్ అన్నారు. తాము ఇద్దరం కడుపులో ఏది దాచుకోమని చెప్పిన రసమయి ఉద్యమంలో పోరాడిన నేతలకు ఎవరికి అబద్దాలు రావని అన్నారు. అయితే ఇదే సంధర్భంలో పక్కనే ఉన్న మంత్రి ఈటేల రాజెందర్ కల్పించుకుని జాగ్రత్తగా మాట్లాడు అంటూ రసమయికి సూచించారు. అయితే రసమయి మాత్రం లైట్‌గా తీసుకున్నారు. ఏమీ కాదులే అన్న అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతంర మాట్లాడిన మంత్రి ఈటేల రసమయి బాలకిషన్‌కు కోంచెం స్వేఛ్చ ఎక్కువని చెప్పారు. అయితే ఆయన మాట్లాడిన మాటలతో తాను ఏకిభవిస్తానని అన్నారు.

mla rasamai balakishan supports to Etela Rajender

దీంతో పార్టీలో ఉద్యమ కాలం నుండి పనిచేసిన నాయకులు ఒక్కమాట మీద ఉండడంతో మరోసారి ఇద్దరి మాటలు చర్చనీయాంశం అయ్యాయి. ఇక రెండు రోజుల క్రితం హుజురాబాద్‌లో ఈటేల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే, పార్టీలో ఉద్యమ కాలం నుండి తాము ఉన్నామని, మంత్రి పదవులు ఎవరి బిక్ష కాదని చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. అయితే వాటిని ఏ సంధర్భంలో అనాల్సి వచ్చిందో అనే వివరణను మంత్రి ఈటేల ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+