శభాష్ రేఖా నాయక్: వాహనం ఆపి ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే

ఎవరికైనా ప్రమాదం జరిగిందనుకో సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. చాలా మంది మనకెందుకులే అనుకుంటారు. అలా చూసి వెళతారు. కొందరే దగ్గరికీ వెళ్లి మరీ సాయం చేస్తారు. ఇక నేతలు/ అధికారులు అయితే పట్టించుకోవడం అరుదు. వాళ్లు సాయం చేస్తే సెన్సేషన్ అవుతుంటుంది. అలాంటి వారి జాబితాలో అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నిలుస్తారు. మంగళవారం ఆమె ప్రమాదానికి గురయిన వ్యక్తికి సాయం చేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రోడ్డు ప్రమాద బాధితుల పట్ల కరుణ చూపారు. మంగళవారం రోజున ఆమె కడెం పర్యటన ముగించుకుని వస్తున్నారు. నిర్మల్ వెళుతుండగా.. ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామ శివార్లలో ఓ కారు చెట్టుకు ఢీకొని ప్రమాదానికి గురైంది. వారికి సాయం చేసేందుకు ఎవరూ లేరు. ఇది గమనించిన ఎమ్మెల్యే రేఖా నాయక్‌ తన వాహనాన్ని నిలిపివేశారు. వాహనం దిగి మరీ పరిస్థితిని సమీక్షించారు.

 mla rekha naik helped to accident people

ప్రమాదంలో ఆ కారులో వారు తీవ్ర గాయపడ్డారని గుర్తించారు. తన సిబ్బంది సాయంతో వారిని తన కారులోకి చేర్చారు. వారిని ఆసుపత్రికి తరలించి.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పి ఉంటది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ తోటి వారు కూడా అదేవిధంగా స్పందించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే రేఖా నాయక్ రియాక్ట్ అయ్యారు.

ప్రమాదం జరిగిన గంటలోపు ఎవరైనా ఆస్పత్రికి వెళితే ఇబ్బంది ఉండదు. చికిత్స అంది.. ప్రాణాపాయం తప్పుతుంది. ఇదివరకు జరిగిన చాలా ప్రమాదాల్లో వైద్యులు కాసేపు ముందు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని చెప్పారు. దానిని కొందరు చక్కగా అమలు చేస్తున్నారు. అందులో ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా నిలిచారు. ఆమె చేసిన మంచి పనిని పలువురు ప్రశంసిస్తున్నారు. శభాష్ అంటూ కొనియాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+