‘జై భీమ్’ మూవీ పై ఎమ్మెల్యే సీతక్క స్పందన - రిప్లై ఇచ్చిన హీరో సూర్య...!!
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జై భీమ్' .ఓటీటీలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. సమాజంలో అణగారిన వర్గాలపై పోలీసుల దాష్టీకాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి ప్రముఖులు సూర్యను అభినందిస్తూ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. మరోవైపు వివాదాలు కూడా ఈ సినిమాను వెంటాడుతున్నాయి. అయితే ఎన్ని వివాదాలు నడుస్తున్నా సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కంటిన్యూ అవుతున్నాయి.
ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్‌హిట్ అవ్వడమే కాదు అనేక రికార్డులతో దూసుకుపోతోంది. అయితే జై భీమ్ చిత్రం విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించి.. హీరో సూర్య, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క) హీరో సూర్యకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలియజేశారు. 'జై భీమ్ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచి అవార్డు సాధిస్తుందని ఆశిస్తున్నా. చిత్రం బృందానికి ముందస్తుగా నా అభినందనలు' అని ఆమె ట్వీట్ చేశారు.
Thank you Ma'am on behalf of our whole team!
— Suriya Sivakumar (@Suriya_offl) November 17, 2021
అయితే ఆమె చేసిన ట్వీట్‌కు హీరో సూర్య స్పందించారు. 'కృతజ్ఞతలు మేడం.. మా చిత్రం బృందం తరఫున మీకు కృతజ్ఞతలు' అని సూర్య రిప్లై ఇచ్చారు. రాజకీయంగా ఎమ్మెల్యేగా ఉన్నా సీతక్క గిరిజన సమస్యలపైన స్పందిస్తూనే ఉన్నారు. కరోనా సమయంలోనూ సీతక్క అందించిన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
I hope this movie gets Oscar award @Suriya_offl garu 🙏
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) November 17, 2021
🔸My Congratulations in advance to entire Jai Bhim movie team 💐@RahulGandhi @priyankagandhi @TribalArmy @HansrajMeena @manickamtagore @JitendraSAlwar @AlankarSawai @vidyarthee @revanth_anumula @MahilaCongress https://t.co/DsjsuZNVXA

Recommended Video
ఇక, ఇప్పుడు సీతక్క జైభీమ్ సినిమా గురించి స్పందించటం..దీనికి ప్రతిగా హీరో సూర్య రిప్లై ఇవ్వటం తో వారి ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడు పీఎంకే నేతలు సూర్య పైన దాడి చేస్తే నజరానాలు ఇస్తామని ప్రకటించటం... ఆయన ఇంటికి బెదిరింపులు రావటంతో భద్రత కల్పించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications