Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంపై ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఉడుంపట్టు..సర్వే నివేదికల్లోనూ సేఫ్; కారణమిదే!!

తెలంగాణ రాష్ట్రంలో అప్పడే ఎన్నికల వేడి కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మళ్లీ టికెట్ కోసం ఇప్పటి నుంచే పడరాని పాట్లు పడుతున్నారు. నియోజకవర్గ ప్రజల నాడిని పట్టుకుని, వారి మద్దతుతో మళ్లీ అవకాశాన్ని చేజిక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ కోవలోనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నియోజకవర్గంపై పట్టుకోసం రకరకాల కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. సైలెంట్ గా తనదైన శైలిలో పని చేసుకుపోతున్నారు.

ప్రజల నాడి పట్టి వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న దాస్యం వినయ్ భాస్కర్

ప్రజల నాడి పట్టి వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న దాస్యం వినయ్ భాస్కర్

ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గం విషయానికి వస్తే విభిన్న సాంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు!... ఇలా అన్ని వర్గాల వారి సమ్మేళనంతో కూడుకున్న నియోజకవర్గం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం. అడ్డా కూలీలు మొదలుకుని ఐఏఎస్ వరకు, ఆటో డ్రైవర్ మొదలుకుని పైలెట్ వరకు, పోలీస్ ఉన్నతాధికారులు, రౌడీషీటర్లు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉండే నియోజకవర్గం అది. అయినప్పటికీ ఆ నియోజకవర్గ ప్రజల నాడిని పట్టి వరుస విజయాలతో ముందుకుపోతున్నాడు దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంపై అందరి పెత్తనం .. ఉమ్మడి జిల్లా కీలక నేతలు అంతా ఇక్కడే

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంపై అందరి పెత్తనం .. ఉమ్మడి జిల్లా కీలక నేతలు అంతా ఇక్కడే

బ్రతుకుదెరువు కోసం కొందరు, ఉద్యోగ రీత్యా మరి కొందరు, వివిధ వ్యాపారాలు చేసే వారు ఇంకొందరు... ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి వేలాది మంది హన్మకొండకు వచ్చి స్థిరపడ్డారు. ఇలా అనేక మందితో కలిపి హన్మకొండ పశ్చిమ నియోజకవర్గం ఏర్పడింది. అందుకే ఈ నియోజకవర్గంలో మరే నియోజకవర్గంలో ఉండని రాజకీయ వాతావరణం ఉంటుంది.

వరంగల్ జిల్లాలోని 12అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు పశ్చిమ నియోజకవర్గ కేంద్రంలోనే నివాసం ఉంటారు. ఉమ్మడి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే నేతలు ఇక్కడే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రాజకీయాల్లో నేతలందరి జోక్యం ఉంటుంది. వివిధ స్థాయిలో ఉండే నాయకులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చక్రం తిప్పాలని చూస్తుంటారు.

2009 నుండి వరుసగా నాలుగు సార్లు వినయ్ భాస్కర్ విజయం

2009 నుండి వరుసగా నాలుగు సార్లు వినయ్ భాస్కర్ విజయం

అయినప్పటికీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు గా ఉన్న దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి వరుసగా విజయాలు సాదిస్తున్నారు. 2009 నుండి వరుసగా నాలుగు సార్లు వినయ్ భాస్కర్ భారీ మెజారిటీతో గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన 2009 నుండి 2014వరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఏకైక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్.

ఈ ఐదేళ్లు తెలంగాణ ఉద్యమాన్ని వినయ్ భాస్కర్ ముందుండి నడిపారు. వినయ్ భాస్కర్ సోదరుడు ప్రణయ్ భాస్కర్ ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ నినాదాన్ని మొదటిసారి వినిపించింది ప్రణయ్ భాస్కర్. అప్పటి నుండి వీరి కుటుంబానికి హన్మకొండ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది.

సొంత కార్యక్రమాలతో నిత్యం ప్రజా క్షేత్రంలో వినయ్ భాస్కర్

సొంత కార్యక్రమాలతో నిత్యం ప్రజా క్షేత్రంలో వినయ్ భాస్కర్

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే కాకుండా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమాలకు వినయ్ భాస్కర్ శ్రీకారం చుట్టారు. మళ్లీ వచ్చే ఎన్నికలలో ప్రజల పక్షాన నిలవాలని ఆయన రకరకాల కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. అపార్ట్మెంట్ దర్శన్, అడ్డా ములాఖత్, కాలనీ దర్శన్, ప్రజలతో ముఖాముఖి, వాక్ అండ్ టాక్ విత్ ఎమ్మెల్యే, కార్మిక మాసోత్సవం లాంటి కార్యక్రమాలను వినయ్ భాస్కర్ స్వయంగా నిర్వహిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాది ముబారక్ చెక్కులను లభ్దిదారుల ఇంటికి వెళ్లి నేరుగా వినయ్ భాస్కర్ ఇస్తుంటారు. రాజకీయాలకు అతీతంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చర్యలు చేపడుతున్నారు. ఇలా వినూత్న కార్యక్రమాలతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ దాస్యం వినయ్ భాస్కర్ మిగితా ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఐ ప్యాక్ సర్వే నివేదికలోనూ వినయ్ భాస్కర్ కు మంచి మార్కులు

ఐ ప్యాక్ సర్వే నివేదికలోనూ వినయ్ భాస్కర్ కు మంచి మార్కులు

తాజాగా టిఆర్ఎస్ పార్టీ కోసం పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ నిర్వహించిన సర్వేలోనూ వినయ్ భాస్కర్ కు మంచి మార్కులే పడ్డాయి అని తెలుస్తుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో మళ్లీ వినయ్ భాస్కర్ కు టికెట్ ఇవ్వచ్చు అన్న అభిప్రాయం సర్వే సంస్థలే వెల్లడించినట్టు తెలుస్తుంది. దాస్యం వినయ్ భాస్కర్ ను ఇప్పటికే నాలుగు సార్లు ఎన్నుకున్న ప్రజలు, మరోమారు ఆదరించటం కోసం వినయ్ భాస్కర్ ఇప్పటి నుంచి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ, ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+