వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేల ఎరకేసు: బీఎల్ సంతోష్, తుషార్ లకు సిట్ నోటీసులపై స్టే పొడిగింపు; ఎప్పటివరకంటే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ స్వామీజీలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పైలెట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజులకు ఒక్కొక్కరికి 100 కోట్ల చొప్పున ఎర చూపి బిజెపి పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేశారని పెద్ద ఎత్తున స్టింగ్ ఆపరేషన్ చేసి మరీ తెలంగాణ ప్రభుత్వం వారిని పట్టుకుంది.

ఎమ్మెల్యేల ఎరకేసు సిట్ చేతి నుండి సీబీఐ చేతికి

ఎమ్మెల్యేల ఎరకేసు సిట్ చేతి నుండి సీబీఐ చేతికి


అంతటితో ఆగకుండా సిట్ ను ఏర్పాటుచేసి దర్యాప్తును కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ వ్యవహారంలో బిజెపి జాతీయ నాయకులు ఉన్నారని, వారిని వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై నిందితులు కోర్టును ఆశ్రయించడంతో, తెలంగాణ ప్రభుత్వ ప్రమేయం ఉందని, సీఎం కేసీఆర్ ఈ కేసుకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేశారని చెప్పడంతో, కథ అడ్డం తిరిగి ఈ కేసు సిట్ చేతి నుండి సిబిఐ చేతికి వెళ్ళింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు కేసులో పెద్దగా పురోగతి లేదు.

బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలకు నోటీసులు .. కోర్టు స్టే

బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలకు నోటీసులు .. కోర్టు స్టే


ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలు ఎర కేసులో అనుమానితుడిగా పేర్కొంటూ బిఎల్ సంతోష్ కు, అలాగే కేరళ రాష్ట్రానికి చెందిన తుషార్ కు, జగ్గు స్వామికి గతంలో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎవరికి వారు విడివిడిగా కోర్టులను ఆశ్రయించారు. బి ఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసి సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే తెచ్చుకున్నారు. ఆయనను ఎలాగైనా అరెస్టు చేయాలని సిట్ అధికారులు శత విధాలా ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యారు . తెలంగాణ ప్రభుత్వం కావాలని తనని ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కూడా..

మళ్ళీ బీఎల్ సంతోష్, తుషార్ స్టే పొడిగించిన తెలంగాణా హైకోర్టు

మళ్ళీ బీఎల్ సంతోష్, తుషార్ స్టే పొడిగించిన తెలంగాణా హైకోర్టు

ఇక ఇటీవల హైదరాబాద్ లో బిజెపి కార్యవర్గ సమావేశాలకు హాజరైన ఆయన తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసి మరీ వెళ్లారు. ఇదే క్రమంలో తాజాగా మరో మారు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో బి ఎల్ సంతోష్, తుషార్ లకు ఫిట్ అధికారులు జారీ చేసిన సిఆర్పిసి 41 ఏ నోటీసులపై తెలంగాణ హైకోర్టు మరో ఆరువారాల పాటు స్టే పొడిగించింది. ఈరోజుతో గతంలో ఇచ్చిన స్టే ముగియడంతో సంతోష్ తరఫున న్యాయవాది దాని పొడిగించాలని మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు.

మళ్ళీ ఆరువారాలు స్టే పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు

మళ్ళీ ఆరువారాలు స్టే పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు

దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి మొదటి రెండు వారాల గడువు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ పై విచారణ పెండింగ్లో ఉందన్న విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేయడంతో, ఆ విచారణ పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందని చెప్పడంతో హైకోర్టు స్టేను ఆరువారాలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో తదుపరి విచారణ మళ్లీ ఆరు వారాల తర్వాత కొనసాగనుంది. అప్పటివరకు బి ఎల్ సంతోష్ కు, తుషార్ కు సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే కొనసాగనుంది.

English summary
The Telangana High Court has issued an order extending the stay on the SIT notices for another six weeks to BL Santosh and Tushar, who have given sit notices in MLAs Poaching case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X