విద్యార్థిని వెంటపడి జుట్టుపట్టి లాగి...: పోలీసుల తీరుపై కవిత ఫైర్ (వీడియో)

హైదరాబాద్: శాంతియుతంగా నిరసన చేస్తున్న ఏబీవీపీ మహిళా కార్యకర్తపై పోలీసులు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. రాజేంద్రనగర్ వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెం. 55 వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఏబీవీసీ నేతలు మద్దతిస్తూ నిరసన చేపట్టారు.

ఈ క్రమంలో ఓ మహిళా కార్యకర్తను స్కూటీపై వెంబడించిన మహిళా కానిస్టేబుళ్లు ఆమె జుట్టు పట్టుకుని లాగారు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసంటూ ఇలా చేస్తారా? అని మండిపడుతున్నారు.

mlc kavitha fires on police for harassing a girl student

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోలీసు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ కవిత మండిపడ్డారు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదన్నారు.

ఇదే నా ఫ్రెండ్లీ పోలీసింగ్? అంటూ ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. ఈ మేరకు కవిత ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ పెట్టారు. పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC) జోక్యం చేసుకోవాలంటూ ట్వీట్‌ను ట్యాగ్‌ చేశారు.

మరోవైపు, రాజేంద్రనగర్‌ వర్సిటీ వద్ద ఓ విద్యార్థిని పట్ల ఇద్దరు మహిళా పోలీసులు అనుసరించిన తీరుపై విచారణ జరుపుతున్నామని.. దర్యాప్తు అనంతరం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ అవినాష్ మహంతి తెలిపారు.

బీజేపీ ఆగ్రహం

ఏబీవీపీ మహిళా కార్యకర్తను జుట్టుపట్టిలాగిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. వ్యవసాయ యూనివర్సిటీ భూములు హైకోర్టుకు కేటాయించవద్దని ఆందోళనకు దిగిన వాళ్లను తరిమికొట్టడమే గాకుండా, రోడ్డున వెళ్తున్న విద్యార్థి నాయకురాలి జుట్టు లాగిన పోలీసుల పైశాచికత్వం. సాటి ఆడవారి పట్ల కనీస మర్యాద పాటించని పోలీసులు. ఈ ఘటన అప్రజాస్వామిక, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వ చర్యలను ప్రతిబింబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+