వదిలిపెట్టేది లేదు.. తీన్మార్ మల్లన్న జాగ్రత్త... కవిత స్ట్రాంగ్ వార్నింగ్

తీన్మార్ మల్లన్న తన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈరోజు తనపైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్సీ కవిత అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఇన్ఫెక్షన్సందర్భంగా తీన్మార్ మల్లన్నకు హెచ్చరికలు జారీ చేశారు.

రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి
తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని, బిసి బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళలపైన పరుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నామని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత, మీరు బీసీ బిడ్డా కాబట్టి ఏదీపడితే అదీ మాట్లాడితే సరికాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

MLC Kavitha hot comments on teenmar mallanna demanded to suspen him from mlc

Take a Poll

ఇంత మాత్రనికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా?
తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మావాళ్ళకు కోపం వచ్చి నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.ఇంత మాత్రనికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా !? అని నిలదీశారు. ఇక ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి, లేదంటే మీరు వెనకనుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్నను తొలగించాలి
తను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కలిశానని,ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి... మీరు ఎథిక్స్ కమిటీకి పిర్యాదు చేయాలని ఛైర్మన్ సూచించారని అన్నారు. తీన్మార్ మల్లన్న జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనను వెంటనే ఎమ్మెల్సీ సభ్యత్వం నుండీ సస్పెండ్ చేయాలని కవిత డిమాండ్ చేశారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం అని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే.. మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటీ అని నిలదీశారు.

ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి
సీఎం, డీజీపీకీ రిక్వెస్ట్ చేస్తున్న.. ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి అని ఆమె పేర్కొన్నారు.గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. తీన్మార్ మల్లన్న ఎవరు అసలు...నన్నెందుకు అడ్డుకుంటాననీ అరుస్తూ గోలా గోలా చేస్తున్నాడు అంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+