రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై ఎమ్మెల్సీ కవిత లాజికల్ క్వశ్చన్స్.. సమాధానం చెప్తారా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రైతుబంధు డబ్బులు ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఎందుకు జమ చేయడం లేదని గ్రామాలలో చర్చ జరుగుతోందని కవిత అన్నారు. రైతుబంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. నిజామాబాద్ రూరల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఇక ఇదే సమయంలో ఎన్నికల సమయంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకున్న పేదలు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేసిన కవిత, ప్రజలు కరెంట్ బిల్లు కట్టవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిందని, మరి నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తులు ఎక్కడా ఎందుకు స్వీకరించడం లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

ప్రజా పరిపాలన దరఖాస్తుల స్వీకరణలో నిరుద్యోగ భృతి ఎక్కడ లేదని ఆమె పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అందాలంటే దరఖాస్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, దరఖాస్తు అవసరంలేని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి రేవంత్ రెడ్డికి ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై ఎమ్మెల్సీ కవిత లాజికల్ క్వశ్చన్స్ వేసి సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మందికి పింఛన్లు అందుతుండగా, వారికి ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండానే పింఛన్ మొత్తాన్ని 2000 రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నా మళ్లీ ఎందుకు దరఖాస్తులు అడుగుతున్నారో చెప్పాలన్నారు. జనవరి 1 నుండి 44 లక్షల మందికి నాలుగు వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణా ప్రజలకు నా విన్నపం...200 యూనిట్లలోపు కరెంటు వాడకానికి బిల్లు కట్టకండి. బిల్లు కట్టనవసరం లేదని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 27, 2023
అలాగే…ఉన్న రేషన్ కార్డులకే పథకాలని సీఎం ప్రకటించడం విడ్డూరం. కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి.
ప్రభుత్వం నుండి పెన్షన్లు అందుతున్న… pic.twitter.com/N0IuTXfC3h
కొత్త రేషన్ కార్డులు జారీ చేయకుండా ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులకు లింకు పెట్టడం విడ్డూరంగా ఉందని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత, వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేసి ఆపై సంక్షేమ పథకాల అమలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఓట్లలో పెద్దగా తేడా లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications