కవిత బ్రహ్మాస్త్రం, టార్గెట్ ఫిక్స్ - వారికి ఉక్కిరి బిక్కిరి..!!

ఎమ్మెల్సీ కవిత వ్యూహాలు ప్రధాన పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కులగణన.. బీసీ రిజర్వే షన్లతో మైలేజ్ సాధించాలని భావించిన వారికి కవిత కార్యాచరణ సమస్యగా మారుతోంది. కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు రావటంతో కవిత రాజకీయంగా చర్చల్లో నిలిచారు. ఇప్పుడు కవిత తాజా అస్త్రంతో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తున్నారు. ఈ నెల 17న కవిత రైల్ రోకో కు పిలుపు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి మద్దతు కోరారు. ఇదే సమయంలో ఢిల్లీ వేదికగా కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి.

కవిత అస్త్రం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ అస్త్రం సంధించారు. ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల పైన గళం విప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓబీసీనని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీకి ఆ వర్గాలకు న్యాయంచేసే అవకాశం లభించిందని చెబుతూనే.. తన డిమాండ్ వినిపించారు. ఆమోదం పొంది 42 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లును కేంద్రం ఆమోదించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17న నిర్వహించబోయే రైల్‌రోకోలో భాగంగా ఒక్క రైలునూ కదలనివ్వబోమని, డెక్కన్‌ నుంచి ఢిల్లీకి రైళ్లను రానిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

MLC Kavitha moving with new strategies to fix main parties over BC Reservation

కీలక మలుపు
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 (డీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి పెంచిన రిజర్వేషన్ల అమలు చేయవచ్చని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉండదని, బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులే ఉంటారని కవిత స్పష్టం చేశారు. ఇప్పటికే కవిత రైల్ రోకో లో భాగస్వాములు కావలంటూ లేఖలు రాసారు. కవిత డిమాండ్‌కు బీసీ సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. తెలంగాణలో తాము చేపట్టిన బీసీ కుల గణన సాహసోపేత నిర్ణయంగా రేవంత్ ప్రభుత్వం ప్రతీ సందర్బంలో ప్రచారం చేసుకుంటోంది. ఈ సమయంలో కవిత బీసీ నినాదంతో చేపడుతున్న ఆందోళనలు ప్రభుత్వానికి సవాల్‌గా మారుతున్నాయి.

MLC Kavitha moving with new strategies to fix main parties over BC Reservation

కవిత డిమాండ్‌తో
రైల్ రోకో ఒక రోజు మాత్రమే ఉంటుందని.. ట్రైలర్ చూపించాలి కాబట్టి ఒక రోజుకే పరిమితం చేస్తున్నామని కవిత చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే నిరవధిక రైల్ రోకో చేపడతామని కవిత హెచ్చరించారు. దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి ఓబీసీల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ.. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ కల్పన పైన ఆదేశించాలని కవిత సూచించారు. తమిళనాడు మోడల్‌లో తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఇక, ఇప్పుడు కవిత సంధించిన బీసీ అస్త్రంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+