ఎమ్మెల్సీ కవిత సింప్లిసిటీ: కంకులు అమ్మే మహిళతో ముచ్చటించిన కేసీఆర్ తనయ!!
ప్రతిరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలలో బిజీగా ఉండే ఎమ్మెల్సీ కవిత ఈరోజు కాసేపు రోడ్డు పక్క సామాన్య మహిళతో ముచ్చటించారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులతో ఆప్యాయంగా మాట్లాడారు. తెలంగాణ సీఎం కెసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వివిధ కార్యక్రమాలలో భాగంగా జగిత్యాల జిల్లాలో పర్యటించారు.
కెసిఆర్ మంచిగిస్తుండు బిడ్డ... జగిత్యాలలో కవితతో కంకులు అమ్మే నర్సమ్మ..!#KCR #KalvakuntlaKavitha #BRSParty #Telangana #Oneindiatelugu pic.twitter.com/ZK8llUMU1e
— oneindiatelugu (@oneindiatelugu) July 10, 2023
అనంతరం జగిత్యాల నుండి తిరుగు ప్రయాణంలో కవిత మల్యాల మండలంలో నూకపల్లి శివారు వద్ద కాసేపు ఆగారు. అక్కడ కంకులు విక్రయిస్తున్న ఒక మహిళ వద్దకు వెళ్ళారు. కంకులు కాలుస్తున్న ఆ మహిళ వద్దకు వెళ్లి కవిత ఆమెతో ముచ్చటించారు. ఆమె వద్ద కంకులు కొనుగోలు చేసి, తింటూ సదరు మహిళతో మాట్లాడారు. ఈ క్రమంలో కవిత సదరు మహిళకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కేసీఆర్ పాలన ఎలా ఉంది. పించన్లు, తెలంగాణ రాష్ట్రప్రభుత్వ పథకాలు ఏవిధంగా అందుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో సదరు కంకులు అమ్మే మహిళ తన పేరు కొమురమ్మ అని పేర్కొంది. నాటికీ నేటికీ కెసిఆర్ పాలనకు తేడాను తనదైన భాషలో ఆమె కవితకు చెప్పే ప్రయత్నం చేసింది. తనకేకాదు ఇంటింటికీ పింఛన్, పలు సంక్షేమ పథకాలను కేసీఆర్ సార్ మంచిగా ఇస్తున్నాడని కొమురమ్మ చాలా సంతోషంగా కవితకు తెలిపింది.
స్వయంగా సీఎం కెసిఆర్ కూతురు తన వద్ద మొక్కజొన్న కంకి తింటూ మాట్లాడటంపై కొమురమ్మ ఆనందం వ్యక్తం చేసింది. ఇక రోడ్డు పక్కన ఆగి కంకి తింటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని చూసిన వాహనదారులు అక్కడ ఆమెపై తమ అభిమానాన్ని ప్రదర్శించారు. కవితతో సెల్ఫీలు, ఫోటోలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇక కవిత కూడా వారిని అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ముఖ్యమంత్రి కూతురుగా ఉన్నప్పటికీ స్వయంగా తానే వచ్చి తన వద్ద కంకిని కొనుగోలు చేసిందని కొమురమ్మ సంతోషం వ్యక్తం చేస్తుంటే, సీఎం కూతురు అయి ఉండి చాలా సాదాసీదాగా కవిత వ్యవహస్తున్నారని పలువురు వాహనదారులు అక్కడ చర్చించుకున్నారు.












Click it and Unblock the Notifications