చంద్రబాబును పిలిచి హైదరాబాదీ బిర్యానీ పెట్టి ఆ పని చేసిన సీఎం రేవంత్!
రేవంత్ రెడ్డికి బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపైన అసెంబ్లీ సమావేశాలు పెట్టి సభలో చర్చిద్దాం రమ్మని ఆమె పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ ఇస్తామని చెప్పిన హామీలు ఇవ్వకుండా మోసం చేసిన విధానం పైన చర్చిద్దాం అన్నారు.
రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ కవిత
సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్ళను గిఫ్ట్ గా ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అబద్ధాలు ఆడటం అలవాటుగా మారిందని కవిత పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్ళించడం చేస్తున్నారని ఇది సరికాదన్నారు. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదని కవిత పేర్కొన్నారు.

తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ ఉద్యమం
మహిళలకు 2500 రూపాయలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కవిత ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీకి అబిడ్స్ gpo నుండి పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అబిడ్స్ gpo లో పోస్ట్ కార్డులను పోస్ట్ చేసిన కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేలాది పోస్ట్ కార్డులను కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారు.
కేసీఆర్ కు సవాల్ విసరటంపై స్పందించిన కవిత
మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదని, పెన్షన్లు మొత్తాన్ని పెంచుతున్నామని చెప్పి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆ హామీని నెరవేర్చలేదని కవిత పేర్కొన్నారు. గోదావరి అంశం పైన అసెంబ్లీలో చర్చకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసరడం పైన స్పందించిన ఆమె ఎస్ అసెంబ్లీలో చర్చ పెడదాం రండి అంటూ పేర్కొన్నారు.
రేవంత్ అది మరచి మాట్లాడటం బాధాకరం
కెసిఆర్ దమ్మెంతో కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి తెలంగాణ వచ్చిందని, తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడని, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయి మాట్లాడటం బాధాకరమని కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.
కాంగ్రెస్ ను ప్రజలు క్షమించరు
కలలో కూడా కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేయరని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు ఓటేసి గెలిపించి 18 నెలలు పూర్తయినా ఇప్పటివరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications