తెలంగాణ ఎన్నికలకు బీజేపీ అగ్రనేతలు.. మోడీ, అమిత్ షా టూర్ ఖరారు..!

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ప్రచార పర్వం వేడెక్కుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలు రోడ్ షోలు, బహిరంగ సభలతో జనాల్లోకి వెళుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బీజేపీ అగ్రనేతల షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటనకు సంబంధించి ప్రచార షెడ్యూల్ రెడీ అయినట్లు సమాచారం. మోడీ 6 సభల్లో.. అమిత్ షా 12 సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

వచ్చే నెల 3, 5 తేదీల్లో మోడీ రాష్ట్రానికి రానున్నారు. ఆయన 6 సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేశారు రాష్ట్ర నేతలు. రోజుకు 3 చొప్పున ఈ రెండు రోజుల పాటు 6 సభల్లో మోడీ ప్రసంగిస్తారని సమాచారం. అదలావుంటే ఈనెల 25, 27, 28 తేదీల్లో అమిత్ షా పర్యటించనున్నారు. వీలునుబట్టి రోజుకి 3 నుంచి 4 చొప్పున 12 సభల్లో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. ఈమేరకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్న నియోజకవర్గాల్లో మోడీ, అమిత్ షా సభలను ఏర్పాటు చేస్తున్నట్లు వినికిడి. అయితే ఈ ఇద్దరి టూర్ మీద బీజేపీ అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

modi and amit shah telangana tour

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+