కన్న కూతుర్నే కడతేర్చిన కసాయి తల్లి, అమ్మమ్మలు; కారణం తెలిస్తే షాక్!!

శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజులలో ఇంకా కుల వివక్ష వేళ్లూనుకుని ఉంది అన్నది అనేక ఘటనలతో వ్యక్తమవుతోంది. తాజాగా వేరే కులం వ్యక్తిని ప్రేమించింది అన్న కారణంతో 17 ఏళ్ల బాలికను పరువు కోసం తల్లి, అమ్మమ్మ కలిసి కడతేర్చిన దారుణ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.

పదవతరగతి చదువుతున్న మైనర్ బాలిక ప్రేమాయణం

పదవతరగతి చదువుతున్న మైనర్ బాలిక ప్రేమాయణం

వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పర్వతగిరి మండల కేంద్రంలో ఉబ్బని సమ్మక్క కు భర్త చనిపోవడంతో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తెకు పెళ్లి చేసింది. ఇక చిన్న కుమార్తె అంజలి తల్లి వద్ద ఉంటూ స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా అంజలి అదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్ అనే యువకుడితో ప్రేమాయణం నడుపుతోంది.

పరువు కోసం పక్కా ప్లాన్ తో బిడ్డనే హతమార్చిన తల్లి, అమ్మమ్మలు

పరువు కోసం పక్కా ప్లాన్ తో బిడ్డనే హతమార్చిన తల్లి, అమ్మమ్మలు

ఇక ఈ విషయం తల్లికి తెలియడంతో, అంజలి ప్రేమిస్తున్న యువకుడి గురించి ఆరా తీసింది. తమ కులానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో తల్లి అంజలి ప్రేమను అంగీకరించలేదు. ప్రశాంత్ తో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించ వద్దని అనేకమార్లు తల్లి సమ్మక్క, అమ్మమ్మ యాకమ్మ హెచ్చరించారు. అయినప్పటికీ అంజలి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదు. పదేపదే ప్రశాంత్ ను కలుస్తుంది.

దీంతో అంజలిలో మార్పు రాకపోవడంతో తమ కుటుంబ పరువు తీస్తుందని వాపోయిన తల్లి, అమ్మమ్మలు చివరికి అంజలిని హతమార్చడానికి సిద్ధమయ్యారు. మొదట ఉరి వేసి హతమారుద్దామని భావించారు. కానీ దొరికిపోతామన్న భయంతో విరమించుకున్నారు. ఆ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం తల్లి సమ్మక్క, అమ్మమ్మ యాకమ్మ ఇద్దరూ అంజలిని ఊపిరాడకుండా చేసి హతమార్చారు.

నిద్రమాత్రలు మింగి మరణించింది అని నమ్మించే యత్నం

నిద్రమాత్రలు మింగి మరణించింది అని నమ్మించే యత్నం

ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళని నమ్మించడం కోసం పెళ్లికి అంగీకరించలేదని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడి చనిపోయినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు. ఇంటి నుండి బయటకు వచ్చి పెద్దగా అరుస్తూ, ఏడుస్తూ తమ కుమార్తె ఏదో మింగి ఆత్మహత్యకు పాల్పడిందని జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అంజలి మెడపై గోళ్ళు గీసుకున్న ఆనవాళ్ళు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అంజలి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నివేదిక కోసం పంపారు. ఫోరెన్సిక్ నివేదికలో అంజలి ఎలాంటి నిద్రమాత్రలు మింగలేదని రావటంతో పోలీసులు తమదైన శైలిలో తల్లిని, అమ్మమ్మని విచారించగా, తామే హతమార్చామని అంగీకరించారు.

తక్కువ కులం వాడిని ప్రేమించింది అని హతమార్చామని ఒప్పుకున్న తల్లి, అమ్మమ్మ

తక్కువ కులం వాడిని ప్రేమించింది అని హతమార్చామని ఒప్పుకున్న తల్లి, అమ్మమ్మ

తమ కంటే తక్కువ కులం వాడిని ప్రేమించినందుకు కుటుంబ పరువు తీస్తుందని సహించలేక హతమార్చామని ఒప్పుకున్నారు. తమ మాట వినకపోవడంతో ఈ విధంగా చేశామని వారు అంగీకరించారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేవలం పరువు కోసం, 17 సంవత్సరాల తెలిసీ తెలియని వయసులో కుమార్తె చేసిన తప్పును సరిదిద్దాల్సిన తల్లి, అమ్మమ్మలు అత్యంత దారుణంగా ప్రవర్తించి మైనర్ బాలిక ఉసురు తీశారు. పేగు బంధాన్ని ఆ తల్లి పరువు కోసం చిదిమేసింది. కుమార్తె తప్పు చేస్తే దిద్దాల్సిన తల్లి నేరమే చేసి కటకటాల పాలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+